వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పార్టీలోకి డిఎల్: వీరశివా శివాలు, చిరు మంత్రిపైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Veerasiva Reddy - DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్యల పైన కడప జిల్లా కమలాపూరం కాంగ్రెసు ఎమ్మెల్యే వీరశివా రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిని పార్టీ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో పార్టీ ఓటమికి డిఎల్, రామచటంద్రయ్యలే కారణమని ఆరోపించారు. డిఎల్ రవీంద్రా రెడ్డి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

సహకార ఎన్నికల్లో ఓటమికి వారిద్దరే కారణమన్నారు. దీనిపై తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాంగ్రెసు ఓటమికి కారణమైన డిఎల్, రామచంద్రయ్యలను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వారిని పార్టీ నుండి కూడా బహిష్కరించాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి డిఎల్ తొత్తులా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ పార్టీకి చెందిన మైసూరా రెడ్డితో కలిసి డిఎల్, రామచంద్రయ్యలు సహకార ఎన్నికలకు ముందే కుట్ర చేశారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రహస్య ఒప్పందం చేసుకున్నారని మరో నేత వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ఆస్తుల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకు ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్లవచ్చునని అంతేకాని, కాంగ్రెసులో ఉంటూ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలను ఊరుకునేది లేదని కడప జిల్లా కాంగ్రెసు నేతలు హెచ్చరించారు.

కాగా ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో కడప జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ గెలుచుకుంది. కాంగ్రెసుకు డిఎల్ రవీంద్ర రెడ్డి, రామచంద్రయ్యలు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరశివా రెడ్డి బుధవారం వారిపై ఒంటికాలిపై లేచారు.

English summary
Kamalapuram Congress MLA Veerasiva Reddy has lashed out at Ministers DL Ravindra Reddy and C.Ramachandraiah on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X