అప్పుతీర్చలేక భార్య తాకట్టు: వ్యాపారి అసభ్య ప్రవర్తన

Mother and Daughter attacked by Unkown person
విజయవాడ/రాజమండ్రి/హైదరాబాద్: కృష్ణా జిల్లా విజయవాడలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేక తన భార్యను అప్పు ఇచ్చిన వ్యక్తికి తాకట్టు పెట్టాడు. జిల్లాలోని అగిరిపల్లిలో ఓ భర్త ఓ వ్యాపారి నుండి గతంలో కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. దానిని తిరిగి చెల్లించలేక తన భార్యను ఆయనకు అప్పగించాడు.

వ్యాపారి నుండి తప్పించుకున్న ఆ భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త అప్పు కింద తనను వ్యాపారికి అప్పగించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. భర్తను, వడ్డీకి డబ్బులు ఇచ్చిన వ్యాపారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

వ్యాపారి వద్ద భర్త కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాగుడుకు బానిసైన అతను ఈ మొత్తాన్ని తీర్చలేక ఆమెను అతని వద్ద కుదువ పెట్టాడట. అయితే వ్యాపారి, అతని గుమాస్తా కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాజమండ్రిలో ఉన్మాది వీరంగం

తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. రాజమండ్రిలోని ఆత్రేయపురంలో ఉన్మాది తల్లీ కూతుళ్లపై బ్లేడుతో దాడి చేశాడు. వారి గొంతును కోసి అక్కడి నుండి పరారయ్యాడు. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

హైదరాబాదులో భార్యపై భర్త దాడి

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ భర్త తన భార్యపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. భార్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడిన భర్త ఓ పోలీసు కానిస్టేబుల్.

ప్రకాశం జిల్లాలోని దర్శి మండలం చందలూరులో ఓ కసాయి కొడుకు కన్న తల్లిదండ్రులపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లిదండ్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు న మోదు చేశారు.

ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+