వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడికి సిగ్గుపడట్లేదు.., 'కాశ్మీర్' కుట్రే!: అఫ్జల్, జైషే లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Afzal Guru
న్యూఢిల్లీ/శ్రీనగర్: 2001లో పార్లమెంటుపై దాడిని మహ్మద్ అఫ్జల్ గురు సమర్థించుకున్నాడు. ఆ విషయాన్ని ఆయన నాలుగేళ్ల క్రితం రాసిన లేఖలో పేర్కొన్నాడు. స్థానిక ఉర్దూ వార పత్రిక సంపాదకుడు షబ్నం ఖయ్యూంకు అఫ్జల్ గురు నాలుగేళ్ల క్రితం లేఖ రాశాడు. అందులో పార్లమెంటుపై తన దాడి సబబే అని పేర్కొన్నాడు. 2001 డిసెంబర్ 13వ తేదిన పార్లమెంటు భవనం పైన జరిగిన దాడికి తాను సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం లేదని రాశాడు.

అసలా దాడిని కుట్రగా అభివర్ణించడం మానుకోవాలని హిజ్‌బుల్ ముజాహిదీన్ సారథి సయీద్ సలాహుద్దీన్‌ను లేఖ ద్వారా కోరాడు. పార్లమెంటుపై దాడులు అనేవి కాశ్మీర్ సమస్యకు సంబంధించినవి కావని, అలాంటి దాడిని పట్టుకుని మనకు మనమే కుట్ర అని చెబుతుంటే అసలు కాశ్మీరు కోసం చేస్తున్న ప్రయత్నాలు మొత్తం కూడా కుట్రే అవుతాయని రాశాడు. అందుకే ఈ దాడిని తాను అవమానంగా భావించడం లేదని కోరాడు.

రైల్వే స్టేషన్లు పేల్చేస్తామని లేఖ

అఫ్జల్ గురు ఉరికి నిరసనగా ఉత్తరాఖండ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్లను పేల్చేస్తామని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ హెచ్చరించినట్లు సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ మేరకు పాక్‌లోని కరాచీ నగర ప్రాంత జైషే కమాండర్‌నంటూ హరిద్వార్ స్టేషన్ సూపరింటెండెంట్‌కు ఒక వ్యక్తి లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

దీంతో హరిద్వార్, డెహ్రాడూన్ స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు. ఇది ఆకతాయిల పని కావొచ్చని, అయినా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు అఫ్జల్ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించాలని ప్రధానికి ఇది వరకే లేఖ రాశానని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

English summary

 Parliament attack convict Mohammad Afzal Guru had in a letter, purportedly written by him over four years ago, said that there was no need to be ashamed of the December 13 attack on Parliament, but had stopped short of owning any responsibility for it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X