వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నిలబెట్టుకొండి: సోనియా సమక్షంలో డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharad Pawar - Ajit Singh
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో తెలంగాణను తేల్చాలని కేంద్రమంత్రులు అజిత్ సింగ్, శరద్ పవార్‌లు మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ చేశారు. ప్రధాని మంగళవారం సాయంత్రం మిత్రపక్షాల భేటీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనియా కూడా పాల్గొన్నారు. మిత్ర పక్షాల నుండి ఎన్‌సిపి నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అభ్దుల్లా, డిఎంకె నేత టిఆర్ బాలు, ఆర్ఎల్‌డి చీఫ్ అజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సమయంలో అజిత్ సింగ్ ఉత్తర ప్రదేశ్ నుంచి హరిత ప్రదేశ్ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో శరద్ పవార్ మాట్లాడుతూ... తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయనతోపాటు అజిత్ సింగ్ కూడా గొంతు కలిపారు. 2004లో అధికారంలోకి వచ్చాక రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణను ప్రస్తావించామని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారట. అయితే, విషయాన్ని తర్వాత చర్చించుతామని వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.

కాగా శరద్ పవార్, అజిత్ సింగ్‌లు తెలంగాణకు మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే కొద్ది రోజుల్లో ఆందోళనలు తగ్గుతాయని రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఈ నెల ప్రారంభంలో చెప్పిన విషయం తెలిసిందే. కేంద్రం త్వరగా తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగినప్పటికీ అవి ఒకటి రెండు నెలల్లో తగ్గిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఇవ్వని పక్షంలో ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. తెలంగాణ ఇస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అనివార్యమని చెప్పారు. తెలంగాణ కోసం యూపిఏ భాగస్వామ్యపక్షాలు అన్నీ కలిసి కాంగ్రెసు పార్టీ పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ రెండు ఏళ్లుగా తెలంగాణపై సంప్రదింపులు జరుపుతూనే ఉందని విమర్శించారు. ఈ అంశాన్ని త్వరగా తేల్చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. శరద్ పవార్ కూడా తెలంగాణకు మద్దతు ప్రకటిస్తున్నారు.

English summary
Making a strong pitch for seperte Telangana, NCP chief Sharad Pawar and RLD chief Ajit Singh told PM Manmohan Singh that a delay in the matter would not be helpful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X