వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్ జైళ్లలో ఎందరున్నారు?: నామా, చర్యలేవి: పొన్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar - Nama Nageswara Rao
న్యూఢిల్లీ: గల్ఫ్ బాధితుల అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు, కరీంనగర్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్‌లు బుధవారం లోకసభలో ప్రస్తావించారు. ఎంతమంది భారతీయులు గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్నారో చెప్పమని అడిగితే ఇప్పటి వరకు కేంద్రం నుండి ఎలాంటి స్పందన లేదని నామా నాగేశ్వర రావు ఆరోపించారు. గల్ఫ్ బాధితులను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

నాలుగేళ్లుగా తాము పార్లమెంటులో ప్రస్తావించినా కేంద్రం తేలిగ్గా తీసుకుంటోందన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమన్వయం కొరవడిందన్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎన్నిసార్లు సమావేశమయ్యారని, ఏం సమీక్షించారని నామా ప్రశ్నించారు. గల్ఫ్ జైళ్లలో ఎంత మంది భారతీయులు మగ్గుతున్నారో లెక్క తేల్చాలని కోరారు. వారిని విడిపించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

ఎంతమంది జైళ్లలో ఉన్నారని తాము అడిగితే ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. అక్రమ ఏజెన్సీలను నిరోధించలేక పోతున్నారన్నారు. నిరుద్యోగులను కొన్ని ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. నాలుగేళ్లుగా నకిలీ సంస్థలు నిరుద్యోగులను ముంచుతున్నాయన్నారు. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్రం ఏం చర్యలు తీసుకుందని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. వారిని విడిపించేందుకు కేంద్రం చొరవ తీసుకువాలని విజ్ఞప్తి చేశారు.

పొన్నం, నామాల ప్రశ్నలకు కేంద్రమంత్రి వాయలార్ రవి సమాధానమిచ్చారు. గల్ఫ్ బాధితుల విషయమై మూడేళ్లలో ఎన్నో ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులపై విచారణ జరుపాలని తాము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమ ఏజెన్సీలు విపరీతంగా పుట్టుకు వస్తున్నాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వాలే దృష్టి సారించాలని చెప్పారు.

English summary
TDP Khammam MP Nama Nageswara Rao and Congress Karimangar MP Ponnam Prabhakar were raised Gulf victims issue in Lok Sabha on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X