వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏర్పాటు చేస్తాం: రాజ్‌నాథ్, చర్చించాం: అజిత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajith Singh-Rajnath Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అనుసరిస్తున్న వైఖరిని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తప్పు పట్టారు. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే తాము అధికారంలోకి వస్తే వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశాన్ని ఆయన బుధవారం లోకసభలో ప్రస్తావించారు.

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రతిపాదిస్తే మద్దతు ఇచ్చేందుకు బిజెపితో పాటు చాలా పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇ్చచిన కేంద్రం తెలంగాణ ఉద్యమకారులను అణచివేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ కోసం చాలా చాలా యేళ్లుగా ఆందోళనలు కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రాల విభజనపై యుపిఎ మంగళవారం జరిగన సమావేశంలో చర్చ జరిగిందని కేంద్ర మంత్రి, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ చెప్పారు. యుపిఎ సమావేశంలో తెలంగాణపై, ఉత్తరప్రదేశ్ విభజనపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. యుపిఎ సమావేశంలో రాష్ట్రాల విభజనపై చర్చ జరగడం శుభపరిణామమని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్రం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.

English summary
BJP president Rajnath Singh said that if UPA will not carve Telangana state, NDA is prepared for that, if it comes into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X