వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కఠిన నిర్ణయాలు ఫలితాలిస్తున్నాయి: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: 9 శాతం వృద్ధిరేటు దేశం ముందున్న అతి పెద్ద సవాల్ అని చిదంబరం అన్నారు. 2013 - 14లో చైనా మాత్రమే వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని చెప్పారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రతిపాదించారు. ఎనిమిదో సారి చిదంబరం కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

ప్రపంచ వృద్ధిరేటు మందగమనంలో ఉందని, ఈ మందగమనం వల్ల మన ఎగుమతుల్లో ఒడిదొడుకులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ద్రవ్యలోటును 4.3 శాతానికి తగ్గించడం బడ్జెట్ లక్ష్యమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో వద్ధిరేటు సరాసరి 8 శాతం సాధించామని, ద్రవ్యోల్బణం తగ్గుదలకు అన్ని వైపుల నుంచి పోరాటం చేయాల్సి ఉందని చిదంబరం అన్నారు. ఆర్థిక వృద్ధిరేటు, సమ్మిళిత అభివృద్ధే ఎజెండా అని చెప్పారు.

విదేశీ పెట్టుబడులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. కఠిన నిర్ణయాలు ఇబ్బంది పెట్టేవైనా ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పన్నులు, సంస్కరణలు ఆర్థిక వృద్ధిలో భాగమేనని ఆయన అన్నారు. యువతకు ఉద్యోవకాశాలు పెంచడమే బడ్జెట్ లక్ష్యమని ఆయన అన్నారు. నిరుటి కన్నా 29.4 శాతం ప్రణాళికా వ్యయం పెరుగుతుందని చెప్పారు.

ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వికలాంగులకు ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు. నెట్‌వర్క్‌ ప్రదేశాలతో పాటు యువతలు లైంగిక వివక్షను చవి చూస్తున్నారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చాలా రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధిలో చోటు దక్కడం లేదని అన్నారు.

English summary
The finance minister P Chidambaram has presented annual budget for the year 2013 - 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X