వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధిరేటు కష్టమే, అయినా సాధిస్తాం: ప్రధాని మాట

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ/హైదరాబాద్: 9 శాతం వృద్ధిరేటు కష్టమేనని, అయినా సాధిస్తామనే నమ్మకం ఉందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌పై ఆయన గురువారం ప్రతిస్పందించారు. చిదంబరం ప్రశంసనీయమైన బడ్జెట్‌ను రూపొందించారని ఆయన అన్నారు. పెట్టుబడుల సమీకరణకు ఆర్థిక మంత్రి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అగాధంలోకి వెళ్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ముందు కలలు సృష్టించి ఆ తర్వాత కోతలు విధించడం యుపిఎ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు. 2012 -13 బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయంలో రూ.93 వేల కోట్లు కోత విధించారని ఆయన విమర్శించారు. దీనివల్ల సంక్షేమం, వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు.

ఎన్నికల దృష్ట్యా కేటాయింపులు అధికంగా చూపినా వెనక కోతలు విధించడం చిదంబర రహస్యమైనని ఆయన అన్నారు. తాజా బడ్జెట్‌లో 6.5 శాతం పెంపు నామమాత్రమేనని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా పన్నులు లేకున్నా, పరోక్షంగా పన్నులు భారీగా పెంచారని ఆయన అన్నారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపినా ద్రవ్యలోటు పూడ్చలేని అసమర్థత యుపిఎదేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులను నిరాశ పరిచిందని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిధిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలన్న డిమాండ్‌ను పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు.

English summary
Reacting on the finance minister P Chidambaram's annual budget for the year 2013 - 14, PM Manmohan Singh said that it is a well planned budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X