వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊహించని విధంగా నిరాశ: బడ్జెట్‌పై సుష్మా స్వరాజ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushma Swaraj
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ బడ్జెట్ ఊహించని విధంగా, చాలా నిరాశాజనకంగా ఉందని బిజెపి నేత సుష్మా స్వరాజ్ అన్నారు. వినడానికి భారీగా ఉన్నా ఈ బడ్జెట్‌లో సరుకు లేదని బిజెపి మరో నేత అరుణ్ జైట్లీ అన్నారు.

చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రయోజనకారిగా ఉందని, సామాన్యులను, ఎస్సీఎస్టీలను విస్మరించిందని బిఎస్పీ నేత మాయావతి అన్నారు. బడ్జెట్ బీహార్ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యంగ్యంగా అన్నారు.

చిదంబరం అతి సాధారణమైన బడ్జెట్‌ను ప్రతిపాదించారని, బడ్జెట్ లక్ష్యరహితంగా ఉందని, నిరాశాజనకంగా ఉందని లోకసత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. చిదంబరం ప్రతిపాదించిన బడ్జెట్‌లో కొత్త దనం ఏమీ లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న 80 శాతం మంది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ అంకెల గారడీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. యుపిఎ వైఫల్యం వల్లనే దేశానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో పూర్తిగా వెనకబడి పోయిందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ, చేతి వృత్తులవారికి అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

English summary
BJP leader Sushma Swaraj has expressed dissatisfaction over the budget proposed by the finance minister P chidambaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X