వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం బడ్జెట్ - 2013 ముఖ్యాంశాలు ఇవే

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్ 2013-14ను కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఆరోగ్యానికి, విద్యకు ప్రాధాన్యం కొనసాగుతుందని చిదంబరం అన్నారు. ఆ బడ్జెట్ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

బడ్జెట్ వ్యయం రూ. 16,65,297 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 5,55,322 కోట్లు

- బంగారం కొనడం కన్నా పొదుపునకే ప్రాముఖ్యం

- విద్యకు రూ. 65 కోట్ల కేటాయింపు

- 6 ఎయిమ్స్ వంటి విద్యాసంస్థల్లో మొదటి బ్యాచ్ విద్యార్థుల ప్రవేశం

- ఎస్సీ, ఎస్టీ విద్యార్థినీవిద్యార్థులకు వేలాది ఉపకారవేతనాలు

- గిరిజన ఉప ప్రణాళికకు రూ. 24,598 కోట్ల కేటాయింపు

- ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ. 41,561 కేటాయింపు

- గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ. 80,000 కోట్ల కేటాయింపు

- స్తీ సమగ్రాభివృద్ధికి రూ. 19,134 కోట్ల కేటాయింపు

- శిశు సంక్షేమానికి రూ. 77,236 కోట్ల కేటాయింపు

- మైనారిటీల సమగ్రాభివృద్ధికి రూ. 3,511 కోట్లు

- మౌలానా అబ్దుల్ కలాం ఫౌండేషన్‌కు రూ. 7.5 కోట్లు

- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు

- పట్టణ ఆరోగ్య మిషన్‌కు రూ. 22,239 కోట్లు

- మానవ వనరుల అభివృద్ధికి రూ. 65,680 కోట్లు

- సర్వశిక్ష అభియాన్‌కు కేటాయింపులు రూ. 27,259 కోట్లు

- సంప్రదాయ వైద్యానికి రూ. 139 కోట్లు

- మాధ్యమిక విద్యా శిక్షణకు రూ. 3,993 కోట్లు

- మధ్యాహ్న భోజనానికి రూ. 13,215 కోట్లు

- మంచినీరు, పారిశుధ్యానికి రూ. 15,260 కోట్లు

- గర్భిణులు, నవజాత శిశు సంక్షేమానికి రూ. 300 కోట్లు

- వ్యవసాయరంగానికి రూ. 27,049

- వ్యవసాయ పరిశోధనకు రూ. 3,415 కోట్లు

- వ్యవసాయ రుణాల పరపతి కల్పన లక్ష్యం రూ. 7 లక్షల కోట్లు

- పంటల శీతిలీకరణ గోదాములకు రూ. 500 కోట్లు

- రోడ్ల రంగానికి నియంత్రణ సంస్థ ఏర్పాటు

- ఆహార భద్రతకు రూ. 10 వేల కోట్ల హామీ

- ప్రైవేట్ బ్యాంకుల్లోనూ 4 శాతం వడ్డీకే రైతులకు రుణాలు- 6 శాతం వడ్డీతో మహిళా కార్మికలకు రుణాలు

- వేయి కోట్లతో మూలధనంతో ప్రభుత్వ రంగంలో ప్రత్యేక మహిళా బ్యాంక్

- పవర్‌లూమ్ ఆధునీకరణకు రూ. 2,400 కోట్లు

- రూ. 25 లక్షల వరకు గృహరుణం పొందేవారికి రూ. లక్ష వరకు అదనపు రాయితీ

- గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యుపీల్లో 3 వేల కిమీ రోడ్ల నిర్మాణం

- రహదారి ప్రాజెక్టు కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ

- వాణిజ్య బ్యాంకుల ద్వారా వ్యక్తిగత, గ్రూపు బీమా

- త్వరలో సెబీ చట్ట సవరణ

- ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓడ రేవుల నిర్మాణం

- అంగన్‌వాడీ వర్కర్లకు జీవిత బీమా

-తలసరి ఆదాయం, అక్షరాస్యత ఆధారంగా వెనకబడిన ప్రాంతాల గుర్తింపు

- సంక్షేమ పథకాలను ఒకే గొడుగు కిందికి తెచ్చేలా ఓ పథకం

- అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు- నిర్భయ ఫండ్ ఏర్పాటు. రూ. 1000 కోట్ల కేటాయింపు ప్రతిపాదన

- సాంకేతిక ఆధునీకరణకు పోస్టాఫీసులకు రూ. 532 కోట్లు

- రక్షణ బడ్జెట్ పెంపు రూ. 2,03,672 కోట్లు

- స్టాక్ ఎక్స్‌ఛేంజీ డెబిట్ డెడికేటెడ్ సెగ్మెంట్‌లో నేరుగా బీమా, ప్రావిడెంట్ ఫండ్స్ ట్రేజ్ చేసుకోవచ్చు

- ఎన్‌హెచ్‌బి ఆధ్వర్యంలో అర్బన్ హౌసింగ్ బ్యాంక్

- గ్యాస్ ప్రాజెక్టుల అమ్మకాలకు ప్రోత్సహం

- జిడిపిలో ప్రత్యక్ష పన్నులు 5.5 శాతం

- జిడిపిలో పరోక్ష పన్నులు 4.4 శాతం- దేశంలో 10 వేల జనాభా పైబడిన ప్రతి పట్టణంలో ఎల్ఐసి కేంద్రం

- గిడ్డంగుల నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు నాబార్డుకు రూ. 5 వేల కోట్లు

- గ్రామీణ గృహ నిర్మాణ నిధి కూ. 6 వేల కోట్లకు పెంపు

- చేనేత రంగంలో స్వల్పకాలిక రుణాలకు 6 శాతం వడ్డీ రాయితీ

- దేశంలో ప్రతి ఒక్కరికీ బీమా భరోసా

- 500 దేశీయ జలమార్గాలు జాతీయ జల మార్గాలుగా ప్రకటన

- సినిమా రంగానికి సేవా పన్ను మినహాయింపు

- జాతీయ బీమా పథకం పరిధిలోకి రిక్షా, ఆటో, పారిశుధ్య కార్మికులు

- సహజ వాయువు ధర విధానం సమీక్షించి, అనిశ్చితి తొలగింపు

- పవన విద్యుత్ రంగానికి ప్రోత్సాహకాలు

- విద్యారంగానికి కేటాయింపుల్లో 17 శాతం పెంపు

- గ్రామీణాభివృద్ధి కేటాయింపుల్లో 46 శాతం పెంపు

- పాటియాలాలో జాతీయ క్రీడల శిక్షణా కేంద్రం

- 294 నగరాలకు ఎఫ్ఎం సేవలు, కొత్త ఎఫ్ఎం చానెళ్లకు అనుమతి

- 173 కేంద్ర ప్రభుత్వ పథకాలను 70 పథకాలుగా కుదింపుి

- మౌలిక సదుపాయాలకు రూ. 50 వేల కోట్ల సేకరణకు ఉచిత పన్ను బాండ్లు

English summary
The finance minister P Chidambaram has presented annual budget for the year 2013 - 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X