హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీహార్ నుండి హైదరాబాద్‌కు ఇద్దరు టెర్రరిస్ట్‌లు, విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఇద్దరు తీవ్రవాదులను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న సయ్యద్ మక్బూల్, ఇమ్రాన్‌లను ఎన్ఐఏ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారిని తీహారు జైలు నుండి హైదరాబాదుకు తరలించారు.

వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి వారి పాత్రపై జాతీయ దర్యాఫ్తు సంస్థ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కోర్టు అనుమతితో ఎన్ఐఏ అధికారులు వీరిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతించడంతో హైదరాబాదుకు తీసుకువచ్చి విచారిస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ ప్రాంతంలోని జంట పేలుళ్ల ఘటనలో జమ్మూ కాశ్మీర్‌లో మరో అనుమానితుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన వ్యక్తి.

అతనిని జమ్మూ కాశ్మీర్‌లోని రాంబస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి పోలీసులు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అవి ఎపికి చెందినవిగా వార్తలు వస్తున్నాయి. అతను గత నెల(జనవరి) 23 నుండి నగరంలో కనిపించడం లేదని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

Hyderabad Blasts

పేలుళ్ల తర్వాత పోలీసులు హైదరాబాదును జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సలావుద్దీన్ నెల రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో అతను జమ్మూలో అరెస్టయ్యారు. పేలుళ్లలో అతని పాత్రపై ఆరా తీస్తున్నారు. అతని పాసుపోర్టును స్వాధీనం చేసుకున్నారు.

English summary
NIA officers took Maqbool and Imran in to their custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X