కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకేం తెలియదన్న జగన్ మేనమామ! లైడిటెక్టివ్ కోసం..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఒకరోజు కస్టడీ గురువారం ముగిసింది. కస్టడీ ముగియడంతో పోలీసులు అతనిని శుక్రవారం తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతనిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.

తనకు బెయిల్ ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి తరఫు లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకరోజు కస్టడీలో రవీంద్రనాథ్ రెడ్డి ఏమీ చెప్పక పోవడంతో పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డికి లై డిటెక్టివ్ పరీక్షల కోసం అనుమతించాలని కోరనున్నారని తెలుస్తోంది. ఫిర్యాదు కాపీ పైన జిల్లా సహకార అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.

దీనిపై మంగళవారం రోజు రవీంద్రనాథ్ రెడ్డి కోర్టులో లొంగిపోయారు. అతని ముందస్తు బెయిల్‌తో పాటు తరవాత దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పోలీసులు కస్టడీ కోరగా.. కోర్టు ఒకరోజుకు అనుమతించింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు.

విచారణలో అతను తనకు ఏమీ తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదు కాపీపై ఎవరు సంతకం చేశారు? డిసివో కార్యాలయం పేరిట నకిలీ స్టాంపు ఎక్కడిది? ఈ రెండు ప్రశ్నలు పోలీసులు అడిగినట్లుగా తెలుస్తోంది. దానికి రవీంద్రనాథ్ రెడ్డి తనకేమీ తెలియదని సమాధానం చెప్పారట.

English summary
YSR Congress Party leaders and former Kadapa Mayor Ravindranath Reddy one day custody completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X