కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ravindranath Reddy
కడప: కడప మాజీ మేయర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అదనపు సివిల్ జడ్జి కోర్టు ఆయనకు శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఫోర్జరీ కేసులో ఆయన ఇటీవల కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు కావడంతో రవీంద్రనాథ్ రెడ్డి రేపు శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇదిలావుంటే, సత్య శోధన పరీక్షకు రవీంద్రనాథ్ రెడ్డిని అనుమతించాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీకి విచారణను వాయిదా వేసింది. రవీంద్రనాథ్ రెడ్డితో వాస్తవాలు చెప్పించడానికి లైడిక్టెర్, నార్కో పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

రవీంద్రనాథ్ రెడ్డి ఒకరోజు కస్టడీ గురువారం ముగిసింది. కస్టడీ ముగియడంతో పోలీసులు అతనిని శుక్రవారం ఉదయం తిరిగి కోర్టులో హాజరుపరిచారు. రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతనిని కోర్టులో ప్రవేశ పెట్టారు. తనకు బెయిల్ ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి తరఫు లాయర్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

తమ విచారణలో రవీంద్రనాథ్ రెడ్డి ఏమీ చెప్పలేదని పోలీసులు అంటున్నారు. ఫిర్యాదు కాపీ పైన జిల్లా సహకార అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం రోజు కోర్టులో లొంగిపోయారు.

పోలీసులు కస్టడీ కోరగా.. కోర్టు ఒకరోజుకు అనుమతించింది. దీంతో రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు గురువారం తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను తనకు ఏమీ తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫిర్యాదు కాపీపై ఎవరు సంతకం చేశారు? డిసివో కార్యాలయం పేరిట నకిలీ స్టాంపు ఎక్కడిది? ఈ రెండు ప్రశ్నలు పోలీసులు అడిగినట్లుగా తెలుస్తోంది.

English summary
Kadapa former mayor and YSR Congress party president Ravindranath Reddy has been granted bail in a forgery case today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X