హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఐడి నోటీసు: శంకరన్న గైర్హాజర్, కూతురితో లేఖ

By Pratap
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: గ్రీన్‌ఫిల్డ్ భూముల వివాదం కేసులో మాజీ మంత్రి, కాంగ్రెసు శానససభ్యుడు పి. శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును హైదరాబాదులోని నేరెడ్‌మెట్ పోలీసుల నుంచి సిఐడి తన చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు శనివారం తమ ముందు హాజరు కావాలని సిఐడి అధికారులు శంకరరావుకు నోటీసులు జారీ చేశారు.

అయితే, శంకర్రావు అనారోగ్యంతో సీఐడీ విచారణకు హాజరుకాలేకపోయారు. తండ్రి తరపున కూతురు సుస్మిత సీఐడీ విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేకపోతున్నట్లు ఓ లేఖను శంకరరావు కూతురు ద్వారా సిఐడికి లేఖను పంపించారు.

గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో శంకరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరుపై గతంలో తీవ్ర వివాదం చెలరేగింది. ఆయనను అదుపులోకి తీసుకున్న తీరును అందరూ ఖండించారు. అయితే, తాము విచారించేందుకే శంకరరావు ఇంటికి వెళ్లామని, స్టేషన్‌కు రమ్మంటే ఆయనే లుంగీ పైన వస్తానని చెప్పారని, తాము ఆయన పట్ల దురుసుగా వ్యవహరించలేదని పోలీసులు చెప్పారు.

ఆ తర్వాత శంకరరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. దుమారంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు. అయితే, శంకరరావు ఏ సమయంలో కూడా సిఐడి అధికారులకు సహకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులను విచారించి సిఐడి అధికారులు ముఖ్యమంత్రికి నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఇద్దరు పోలీసులపై చర్యలు కూడా తీసుకున్నారు. తాజాగా, గ్రీన్‌ఫీల్డ్ వ్యవహారంలో శంకరరావుకు సిఐడి నోటీసులు జారీ చేసింది.

English summary
The former minister and Congress MLA P Shankar rao has failed to attend before CID in Green Field land case due to ill health. His daughter Susmitha attended on behalf of his father.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X