విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహ వివాదం: బాబు వద్ద అపరిచుతుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR Statue
విజయవాడ: కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్టీ రామరావు విగ్రహ ఆవిష్కరణ వివాదంగా మారింది. చంద్రబాబునాయుడితో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. అయితే విగ్రహావిష్కరణకు అనుమతిలేదంటూ సీఐ అడ్డుకున్నారు.

సిఐపై శాసనసభ్యుడదు జలమంగళం వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తపరిచారు. 2009లోనే విగ్రహావిష్కరణకు అనుమతించారని, సీఐ వ్యవహారంపై హోంమంత్రి, డీఐజీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని శాసనసభ్యుడు తెలిపారు.

ఇదిలావుంటే, వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా కూచిపూడిలో బస చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు క్యాంపులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొయ్యరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాగులోంచి గొడ్డలి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

కొయ్యరాజును కూచిపూడి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే చంద్రబాబును చూసేందుకు మాత్రమే వచ్చాచని కొయ్యరాజు చెబుతున్నాడు. అతడిని కూచిపూడి పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కొయ్యరాజు నల్లగొండ జిల్లావాసిగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

English summary
The NT Ramarao statue installation at Kaikalur of Krishna district has turned into a controversy. Meanwhile, a person has been arrested in a suspicious condition near Telugudesam president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X