హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

21న సడక్ బంద్‌కు తెలంగాణ జెఎసి పిలుపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ఈనెల 21 న సడక్ బంద్ నిర్వహించాలని తెలంగాణ రాజకీయ జెఎసి నిర్ణయం తీసుకుంది. అదే రోజు హైదరాబాద్-బెంగుళూరు జాదీయ రహదారిని దిగ్బంధం చేస్తున్నట్లు తెలంగాణ జేఏసీ ప్రకటించింది. శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు భారీ ఎత్తున సడక్ బంద్‌ను నిర్వహిస్తామని తెలంగాణ జెఎసి తెలిపింది.

శనివారం ఉదయం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పాలమూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సడక్ బంద్‌పై చర్చిస్తామని తెలిపారు. సడక్ బంద్ నేపథ్యంలో తెలంగాణవాదులని అరెస్టు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బైండోవర్లకు, అరెస్టులకు జేఏసీ భయపడదని ఆయన చెప్పారు.

తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరూ తమతో కలిసిరావాలని ప్రొ. కోదండరాం పిలుపునిచ్చారు. లేని పక్షంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 24న చేపట్టాల్సిన సడక్ బంద్‌ను జేఏసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

శనివారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానికి బిజెపి నేతలు హాజరు కాలేదు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశానికి వెళ్లారు.

English summary
Telangana JAC has decided to organise postponed sadak bandh on March 21. Due to Hyderabad band blasts Telangana JAC has postponed its sadak bandh earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X