హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోఠి.. 12 చోట్ల రెక్కీ: అర్ధరాత్రి పేలుళ్ల ప్రాంతానికి టెర్రరిస్ట్స్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Blasts was planned in 2012 after recce
హైదరాబాద్: ఎన్ఐఏ అధికారులు న్యూఢిల్లీలోని తీహార్ జైలు నుండి హైదరాబాదుకు ఇమ్రాన్, మక్బూల్‌లను తీసుకు వచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో ఎన్నో నివ్వెరపర్చే విషయాలు బయటపడ్డాయి. ఉగ్రవాదులు కేవలం దిల్‌సుఖ్ నగర్‌లోనే కాకుండా జనసమ్మర్దం గల పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టేందుకు రెక్కీ నిర్వహించారట. ఇమ్రాన్, మక్బూల్‌లను ఎన్ఐఏ అధికారులు శనివారం అర్ధరాత్రి దిల్‌సుఖ్ నగర్‌లో పేలుడు జరిన ప్రాంతానికి తీసుకు వచ్చారు.

మొదట వారిని అర్ధరాత్రి వరకు బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారించారు. ఆ తర్వాత దిల్‌సుఖ్ నగర్‌కు తీసుకు వచ్చారు. దిల్‌సుఖ్ నగర్‌తో పాటు కోఠి, బేగంబజార్, దిల్‌సుఖ్ నగర్ నుండి కోఠి వరకు రహదారి, సికింద్రాబాద్ తదితర పన్నెండు ప్రాంతాల్లో బాంబులు పెట్టేందుకు రెక్కీ నిర్వహించినట్లుగా వారు విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది.

పేలుళ్లకు గత ఏడాదే ఇండియన్ ముజాహిదీన్ ముఖ్యులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్‌తో కలిసి మక్బూల్ కుట్ర పన్నాడు. తొలుత సాయిబాబా గుడినే టార్గెట్ చేసుకున్నారు. అయితే, గుడి ప్రధాన ద్వారం, సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో సిసిటివి కెమెరాలు అమర్చారు. దీంతో, పేలుళ్లకు అనువైన ప్రాంతం కోసం మక్బూల్ గాలించాడు. సిసి కెమెరాలు ఎక్కడ ఉండవు? ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటూనే సిసి కెమెరాలు, పోలీసు బందోబస్తు ఉండని ప్రాంతం ఏదో గుర్తించాడు. పేలుళ్లకు స్కెచ్ వేశాడు. ఈ లోగా పుణె పేలుళ్ల కేసులో మహారాష్ట్ర ఎటిఎస్ పోలీసులకు మక్బూల్ చిక్కాడు.

కాగా, మక్బూల్ తీహార్ జైల్లో ఉండగా ఎవరెవరు కలిశారు? అనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. జైలుకు ములాఖత్‌కు వచ్చినప్పుడు సిసి కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన 12 మంది యువకులను గుర్తించినట్లు తెలిసింది. అయితే, పేలుళ్ల తర్వాత వారంతా అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తించారు. మరికొందరు ఉద్యోగం పేరిట దుబాయ్‌కు, అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందారని మక్బూల్ చెప్పినట్లు తెలిసింది.

English summary

 It is said that IM spent Rs.10 lakh to Dilsukhnagar blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X