వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోశ వేసినంత వీజీ కాదు: తెలంగాణపై వాయలార్ రవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రమంత్రి వాయలార్ రవి మరోసారి విచిత్రమైన కామెంట్ చేశారు. సోమవారం పలువురు మీడియా ప్రతినిధులు వాయలార్ రవిని తెలంగాణ విషయమై అడిగారు. తెలంగాణపై నెల రోజుల్లో తేల్చుతానని చెప్పారని, ఆ తర్వాత మరో పది పదిహేను రోజులు పట్టవచ్చునని చెప్పారని ఏమయిందని మీడియా ప్రతినిధులు అడిగారు.

దానికి వాయలార్ రవి స్పందిస్తూ.. తెలంగాణ సమస్యపై పరిష్కారం దోశ వేసినంత సులువు ఏం కాదని అన్నారు. తెలంగాణ విషయంలో రాజకీయ నాయకుల కంటే మీడియాకే ఎక్కువగా ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైనదని, పరిష్కారం క్లిష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా గతేడాది డిసెంబరులో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రం నుండి తెలంగాణపై అఖిల పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెసు మినహా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పాయి! తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు తెలంగాణకు అనుకూలంగా, సిపిఐ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు నిర్ణయాన్ని కేంద్రంపై వేశాయి. మజ్లిస్ పార్టీ సమైక్యాంధ్ర లేదంటే రాయల తెలంగాణను ప్రతిపాదించింది. కాంగ్రెసు నుండి వెళ్లిన ఇద్దరు రెండు వాదనలు వినిపించారు.

అన్ని పార్టీల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత షిండే మాట్లాడుతూ.. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జనవరి 28వ తేదీ లోగా తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం వస్తుందని అందరూ భావించారు. కానీ, కేంద్రం ఈ విషయమై మళ్లీ తాత్సార మంత్రాన్నే పఠించింది. కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ నెల అంటే ముప్పయి రోజులు మాత్రమే కాదని, వారం అంటే ఏడు రోజులు మాత్రమే కాదని చెప్పి అందర్నీ ఆశ్చర్యపర్చారు. త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ, షిండే ఇచ్చిన గడువు దాటి నెల దాటినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాలేదు.

English summary
Central Minister Vayalar Ravi said that Telangana issue is not easy like preparing of Dosa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X