గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరగబెట్టిన కాలి నొప్పి: షర్మిల పాదయాత్ర ప్రారంభం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sharmila
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల కాలి నొప్పి తిరగబెట్టింది. దీంతో ఆమె తన పాదయాత్రను గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం యెన్నదేవి గ్రామం వద్ద ఆపేశారు. ఆమె తన పాదాయత్రను దూళిపాలలో ప్రారంభించి ఐదు కిలోమీటర్ల మేర నడిచారు.

ఓ వ్యక్తి శనివారం రాత్రి షర్మిల కాళ్లకు అడ్డం పడ్డాడు. అతన్ని ప్రయత్నంలో ఆమె కాలు మెలిక పడింది. దీంతో ఇది వరకే శస్త్రచికిత్స జరిగి ఉండడంతో నొప్పి తిరగబెట్టింది. ఆ నొప్పితోనే ఆమె ఆదివారం పాదయాత్ర కొనసాగించారు. నొప్పి తీవ్రం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దాంతో పాదయాత్రను ఐదు కిలోమీటర్లకు కుదించారు.

శస్త్ర చికిత్స జరిగిన కుడికాలుపై కొంత కాలం దాకా ఒత్తిడి పడకుండా చూడాలని వైద్యులు సలహా ఇచ్చారు. నొప్పి తగ్గేంత వరకు ఎక్కువ దూరం నడవడం మంచిది కాదని వారు చెప్పారు. దూరాన్ని తగ్గించి, మెల్లగా నడవాలని వారు చెప్పారు. విద్యుత్ కోతకు నిరసనగా సత్తెనపల్లిలో జరిగే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధర్నాలో ఆమె పాల్గొంటున్నారు.

ఇంత దారుణమైన విద్యుత్ సంక్షోభం ఎప్పుడూ లేని, తాను దారి వెంట నడుస్తున్నప్పుడు కరెంట్ రాక, నీళ్లు లేక ఎండిపోయిన పంటనపొలాలను చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని షర్మిల ఆదివారంనాడు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆమె విమ్రసించారు.

కాగా, షర్మిల పాదయాత్రకు విశ్రాంతి వస్తుందనుకున్నప్పటికీ ఆమె సోమవారం పాదయాత్రను ప్రారంభించారు. ఆమె పాదయాత్ర 81వ రోజుకు చేరుకుంది.

English summary
YSR Congress chief YS Jagan Mohan Reddy’s sister YS Sharmila Reddy’s padayatra was stopped again due to leg pain at Yennadevi village of Sattenapalli mandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X