• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దోశతో తెలంగాణ పోలిక: జగ్గారెడ్డి మద్దతు, హరీష్‌పై ఫైర్

By Srinivas
|

 Jagga Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి వాయలార్ రవి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని మెదక్ జిల్లా సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) మంగళవారం అన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను ఇప్పటికిప్పుడు తేల్చేయలేరన్న ఉద్దేశంతోనే వయలార్ మాట్లాడారన్నారు. మూడు ప్రాంతాల నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారితో చర్చించి పరిష్కరించాల్సిన సున్నితమైన అంశమని అన్నారు. కాని, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కేవలం రాజకీయం చేయడం కోసమే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ ఎదుగుదల కోసమే తెలంగాణ వాదాన్ని తెరాస ఉపయోగించుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ములేకే దూరంగా స్థాయీ సంఘాల అవగాహనా సదస్సును పెట్టారన్న తెరాస సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ... కిరణ్‌కు దమ్మూ ధైర్యం లేదని అనేందుకు అతనెవరని, ఆయన ఏవిధంగా శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తున్నాడో అందరికీ తెలుసునని, ఆయన్ను విమర్శించే అర్హత హరీశ్ రావుకు లేదన్నారు.

కాగా అంతకుముందు పోలవరం టెండర్లను ట్రాన్స్‌స్ట్రాయ్-యూఈఎస్ జాయింట్ వెంచర్‌కు కట్టబెట్టిన వ్యవహారంలో కిరణ్‌పై హరీశ్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఫోర్జరీపత్రాలతో టెండర్లలో పాల్గొన్న ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆయనకు ఆయనే తాను మిస్టర్ క్లీన్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అని చెప్పుకుంటారని, అదే నిజమైతే ఆయన డిఫెక్ట్ కాకపోతే పోలవరం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.

అన్ని అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. అప్పుడు కిరణ్ ముఖ్యమంత్రా లేక మురికిమంత్రా అన్న విషయం తేలుతుందని చెప్పారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ సమర్పించిన పత్రాలు ఫోర్జరీవని రష్యా తేల్చిన తర్వాత కూడా దానికే టెండర్లు ఇవ్వటం వల్ల అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందన్నారు. దీనిపై కోర్టుకు వెళ్తామని, చివరిదాకా పోరాడుతామని స్పష్టం చేశారు. సీవీసీ, లోకాయుక్త సహా అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎందుకో మౌనంగా ఉందని అన్నారు.

English summary
Government Whip and Sangareddy MLA Toorpu Jayaprakah Reddy(Jagga Reddy) has supported Central Minister Vayalar Comments on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X