హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐబి హెచ్చరిక: ఐమాక్స్, లుంబినీ ప్రాంతంలో తనిఖీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఐమాక్స్ థియేటర్ పరిసరాలలో ఆక్టోపస్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మళ్లీ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశముందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆక్టోపస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. బుధవారం, గురువారం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నిఘా వర్గాలు హెచ్చరించాయి. అప్రమత్తంగా ఉంటే మళ్లీ ఉగ్రవాదులు చెలరేగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందించారు.

దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల అనంతరం రాజధానిలో ఏదో ఒక పక్క బాంబు ఉందంటూ ఫోన్‌లు రావడం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. లుంబినీ పార్క్‌లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేసింది. వనస్థలిపురంలో పోలీసులు తనిఖీల్లో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరుగవచ్చనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అటు లుంబినీ పార్కులోనూ పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు.

నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ రైలులో బాంబు ఉన్నట్లు కలకలం చెలరేగింది. దీంతో బాంబు స్వ్కాడ్ అక్కడకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో వదిలి వెళ్లిన రేడియోను చూసి ప్రయాణీకులు బాంబుగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదాశివనగర్ మండలం ఉప్పలవాయి రైల్వే స్టేషన్‌లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

English summary
Chittoor district police found two land mines between Rompicherla and KVPally of Peeleru Mandal of Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X