గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసులపై ఒత్తిడి, ప్రోద్భలం లేదు: సిబిఐ లక్ష్మీనారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Laxmi Narayana
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసులు దర్యాఫ్తు చేస్తున్న సిబిఐ అదనపు సంచాలకులు లక్ష్మీ నారాయణ మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. కేసుల విచారణలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు.

తన విధి నిర్వహణను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. సిబిఐ కేసులు ఎవ్వరి ప్రోద్బలంతో జరగడం లేదని, పారదర్శకంగా పని చేస్తోందన్నారు. యువత సిబిఐలో ఉద్యోగాలు సంపాదించవచ్చని, కానిస్టేబుళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా సిబిఐలోకి రావొచ్చని చెప్పారు. నేడు దేశంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలకు సంబంధించి ఆయా రంగాల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల సాయంతో నేర పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.

పలు కేసులలో సాంకేతిక నిపుణుల ఆవశ్యకత వుంటుందని, వారి ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన కేసులను త్వరగా ఛేదించడం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక నేరాలకు సంబంధించి పలువురు బ్యాంకర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి నిపుణులు కేసుల పరిశోధనలో సిబిఐ టీంతో సహకరిస్తుంటారని చెప్పారు.

నైజీరియన్ క్రైమ్‌లు పెరిగాయని, ఈమెయిల్, సెల్‌ఫోన్లలో లక్షల డాలర్ల బహుమతులు వచ్చాయంటూ మెసేజ్‌లు పంపించి వారి బ్యాంకు అకౌంట్లు, తదితర విషయాలను తెలుసుకుని ప్రజలను మోసగిస్తున్నారని, ఎవ్వరూ మోసపోవద్దని, సంబంధిత పోలీసులకు, సిబిఐ వారికి ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.

English summary
CBI JD Laxmi Narayana said that there is no political pressures on him in cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X