వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు యాత్ర: కొడాలి నాని హంగామా, దాడి చేశారని...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodali Nani
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర గుడివాడలో కొనసాగుతున్న సమయంలో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహిస్తున్న యువకులపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.

గుడివాడలో యువ కార్యకర్తలు మోటారు సైకిళ్ల ర్యాలీని ఏర్పాటు చేసుకున్నారు. గుడ్లవల్లేరు యువకులు ర్యాలీ చేస్తూ వాసవీ చౌక్, శరత్ థియేటర్ మీదుగా వస్తుండగా కొడాలి నాని ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మోటారు సైకిల్‌పై ఉన్న ఒక యువకుడిపై నాని చేయి చేసుకొని బైక్ లాగేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరుపక్షాలనూ పంపించివేయడంతో పరిస్థితి చల్లబడింది.

శరత్ థియేటర్ సమీపంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఫ్లెక్సీల విషయమై ఈ గొడవ వచ్చినట్లుగా చెబుతున్నారు. థియేటర్ ప్రాంతంలో ఫ్లెక్సీల విషయంలో టిడిపి నేత రావి వెంకటేశ్వర రావు, కొడాలి నాని వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. నాని తమ వర్గీయుడిపై చేయి చేసుకున్నారు టిడిపి నేతలు ఆరోపించారు. శరత్ థియేటర్ నానికి చెందిన వర్గం వారిది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేయడంతో నాని వర్గం వారు శరత్ థియేటర్‌లోకి వెళ్లిపోయారు.

ఆ తర్వాత అదే మార్గం గుండా చంద్రబాబు పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని తమ అదుపులోకి తీసుకు వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు గుడివాడ బహిరంగ సభలో మాట్లాడారు.

English summary
Tension created in Gudivada on Tuesday between Telugudeam and YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X