వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుపోషణపై యుద్ధం: ఆగే రహేగా మోడీ గుజరాత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Which State improved most in Malnutrition?
న్యూఢిల్లీ: పిల్లల్లో పోషకాహార లోపంపై పోరాడుతున్న రాష్ట్రాల్లో ఏది ముందు ఉందనేది ప్రశ్న. ఈ విషయంలో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గుజరాత్ రాష్ట్రం చాలా వేగంగా ముందుకు కదులుతోంది. సమీకృత శిశు అభివృద్ధి పథకం అమలుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గుజరాత్ రాష్ట్రంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

ఆరు రాష్ట్రాల కారణంగా అసంతులన ఆహారం విషయంలో భారతదేశంలో ప్రగతి కనిపిస్తోందని కాగ్ తెలిపింది. అది 41.16 శాతానికి చేరుకుంది. ఆ ఆరు రాష్ట్రాలు - గుజరాత్ (పోషకాహార లోపంతో బాధపడే పిల్లల శాతం 71 శాతం నుంచి 39 శాతానికి తగ్గింది), కర్ణాటక (45 నుంచి 23 శాతానికి తగ్గింది), మహారాష్ట్ర (45 నుంచి 23 శాతానికి తగ్గింది), ఉత్తరప్రదేశ్ (53 నుంచి 41 శాతానికి తగ్గింది), ఉత్తరాఖండ్ (46 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది), పశ్చిమ బెంగాల్ (53 శాతం నుంచి 37 శాతానికి తగ్గింది). 2007, 2011 తులనాత్మక పరిశీలన బట్టి ఈ గణాంకాలను తీయడం జరిగింది.

పిల్లల పోషకాహార లోపంపై పోరాటం చేస్తూ దాన్ని తగ్గించే రాష్ట్రాల్లో గుజరాత్ అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉందని గానీ పూర్తిగా చెత్తగా ఉందని గానీ చెప్పలేం. ఈ రాష్ట్రం మధ్యస్థంగా ఉంది. చాలా వెనకబడిన రాష్ట్రాలు - ఆంధ్రప్రదేశ్ (49 శాతం పోషకాహారలోపం), బీహార్ (82 శాతం), హర్యానా (43 శాతం), రాజస్థాన్ (43 శాతం), ఆశ్చర్యకరంగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీలో50 శాతం పోషకాహార లోపం ఉంది.

గుజరాత్ కన్నా పోషకాహార లోపాన్ని అరికట్టే విషయంలో రాష్ట్రాలు మహారాష్ట్రలో 77 శాతం కన్నా ఎక్కువ సాధారణ పిల్లలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 72 శాతం మంది ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో 75 శాతం మంది ఉన్నారు. అంటే వీరంతా సాధారణ స్థితిలో ఉన్న పిల్లలన్న మాట.

ఆలా అని గుజరాత్ అభివృద్ధి నమూనా సమస్యకు కారణం కాదు. అంకెలు చూస్తే పోషకాహార లోపంపై గుజరాత్ పోరాటం చేస్తున్న తీరు ఎలా ఉందనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం. 2007లో గుజరాత్‌ పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఆ శాతం 70.69. అప్పుడు జాతీయ సగటు 50.1. అంటే, అప్పుడు గుజరాత్‌లో జాతీయ సగటు కన్నా పోషకాహారలోపంతో బాధపడుతున్న పిల్లల స్థితి ఉందని అర్థం.

2011నాటికి ఆ శాతం 38.77 శాతానికి తగ్గింది. భారతదేశంలో పోషకాహార లోపాన్ని అరికట్టడంలో వేగవంతమైన అభివృద్ధిని గుజరాత్ సాధించింది. ప్రస్తుతం జాతీయ సగటు 41.16 శాతం ఉంది. గుజరాత్ ఈ విషయంలో అత్యంత వేగంగా ప్రగతి సాధించి, జాతీయ సగటుకన్నా దిగువకు చేరుకుంది. అందుకే, పోషకాహార లోపాన్ని అరికట్టడంలో గుజరాత్ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని కాగ్ వ్యాఖ్యానించింది.

English summary
According to CAG's latest report on the Integrated Child Development Scheme (ICDS) – whose focus is to eliminate child malnutrition in all states, Gujarat has improved most in malnutrition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X