వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలిక నేహా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neharamu
లండన్: భారతీయ సంతతికి చెందిన పన్నెండేళ్ల నేహా రాము మేధస్సు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్‌ల కంటే ఎక్కువ. ఐన్ స్టీన్, హాకింగ్, గేట్స్ మేధో స్థాయి 160. నేహారాము మేథో స్థాయి వీరికంటే రెండు పాయింట్లు ఎక్కువగా ఉంది. 162 పాయింట్లు సాధించి రికార్డ్ సృష్టించింది. తెలివితేటలు లెక్కించేందుకు ఐన్‌స్టీన్‌ను ప్రమాణంగా తీసుకుంటారు. ఇటీవలి కాలంలో ఐక్యూలో ఐన్‌స్టీన్‌నే మించిపోయే చిన్నారుల సంఖ్య బాగా పెరుగుతోంది.

గత అక్టోబర్‌లో ఒలీవియా మానింగ్ అనే బాలిక 162 ఐక్యూతో మేధావుల క్లబ్ మెన్సా‌లో చోటు సాధించింది. తాజాగా బ్రిటన్‌లో ఉంటున్న నేహారాము ఈ ఘనత సాధించింది. నేహా తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ కంటి వైద్యులే. యుకెలోని మెన్స్ నిర్వహించే ఐఐఐబి పరీక్షలో ఆమె ఈ స్కోరు సాధించింది. నేహా ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు కింగ్ స్టన్‌కు వలస వెళ్లారు.

నేహా సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. నేహాను చూసి తాము గర్వపడుతున్నామని, ఈ సంతోషం మాటల్లో చెప్పలేమంటున్నారు. ఆమె మేధస్సును తల్లిదండ్రులు మొదట్లో గుర్తించలేదు. ఓ పరీక్షలో ఆమె 280కి 280 మార్కులు సాధించింది. అప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మేధస్సుపై దృష్టి సారించారు. హారీపోటర్ వీరాభిమాని అయిన నేహాకు ఈత కొట్టడం సరదా.

మెన్స్ పరీక్ష చాలా కష్టమని, అందులో అంత స్కోరు సాధిస్తానని తాను ఊహించలేదని, సోమవారం ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానని, సంతోషంగా ఉందని నేహా రాము అన్నారు. కాగా, ఐన్ స్టీన్ తన జీవిత కాలంలో ఎప్పుడూ ఇలాంటి మేధో స్థాయి పరీక్షలు ఎదుర్కోలేదు. అయితే ఆయన మేధోస్థాయి 160 వరకు ఉంటుందనేది అంచనా మాత్రమే.

English summary
A 12-year-old Indian-origin girl in UK has stunned everyone after she scored an incredible 162 on her IQ test - even higher than Einstein and Stephen Hawking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X