వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెట్లకు నీళ్లు పోసి.. ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ట్రాక్టర్ ఎక్కి హల్‌చల్ చేశారు! మెదక్ జిల్లా జహీరాబాదులో మహింద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల ఉత్పత్తి ప్లాంటును కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్‌ను ఎక్కారు. ట్రాక్టర్ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభోత్సవం సందర్భంగా కిరణ్ మాట్లాడారు. కరెంట్ కొరత కారణంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని కానీ, ఈ ఇక్కట్లు ఎంతో కాలం ఉండవని, పడమటి తీరం నుంచి గ్యాస్ రప్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

అక్టోబర్ నాటికి కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. రుతుపవనాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టయితే అంతకన్నా ముందే పరిస్థితి చక్కబడుతుందన్నారు. రాష్ట్రానికి 7,000 మెగావాట్ల అదనపు విద్యుదుత్పాదక సామర్థ్యం సాధించగల శక్తి ఉన్నప్పటికీ గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల కష్టాలు తప్పలేదని వివరించారు. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించడానికి రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని,మంచి ప్రాజెక్టులతో ముందుకు రావాల్సిందిగా ఆయన పిలుపు ఇచ్చారు.

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు మంచి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 1.33 లక్షల కోట్ల రూపాయల విలువైన 69 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని, సమీప భవిష్యత్తులోనే వాటిలో అధిక శాతం ప్రాజెక్టులు వాస్తవ రూపంలోకి వస్తాయని చెప్పారు. మహీంద్రా గ్రూప్ రాష్ట్రంలో ఖాయిలా పడిన పరిశ్రమలను పట్టాలకెక్కించడంలో చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

మహింద్రా అండ్ మహింద్రా ట్రాక్టర్ ఉత్పత్తి కంపెనీలో చెట్లకు నీళ్లు పోస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చేయి వేసిన గీతారెడ్డి.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

ప్లాంటును ప్రారంభిస్తున్న కిరణ్.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

కిరణ్‌తో జిల్లా మంత్రులు గీతారెడ్డి, సునితా రెడ్డి.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

కిరణ్‌తో మంత్రులు, మహేంద్ర కంపెనీ యాజమాన్యం.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

గీతారెడ్డిని, ఆనంద్ మహింద్రాను ఎక్కించుకొని డ్రైవర్ సీటులో కూర్చున్న కిరణ్.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

ప్రారంభోత్సవం.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

జ్యోతి ప్రజ్వలన.

ట్రాక్టర్ ఎక్కి కిరణ్ హల్‌చల్(పిక్చర్స్)

మాట్లాడుతున్న కిరణ్.

నష్టాల ఊబిలో కూరుకుపోయిన అల్విన్ నిస్సాన్ కంపెనీని కొనుగోలు చేసి ఇప్పుడు రాష్ట్రంలోనే అగ్రగామి ఆటోమొబైల్ యూనిట్‌గా తీర్చి దిద్దారని, దివాలా స్థితికి చేరిన సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి పునరుజ్జీవన పథంలో ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రస్తావించారు. దివాలా కంపెనీలను పునరుద్ధరించడమే కాకుండా కొత్త ప్రాజెక్టులు కూడా చేపట్టాలని ఆయన ఎంఎం అధినేత ఆనంద్ మహీంద్రాను కోరారు.

English summary
CM Kiran Kumar Reddy said that power crisis will be solved in the month of July. He said that power crisis is prevailing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X