వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవితల కత్తులు దూసుకున్న మన్మోహన్, సుష్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష బిజెపి నేత సుష్మా స్వరాజ్ కత్తులతో యుద్దం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ తన సహజశైలికి భిన్నంగా మాట్లాడారు. కవితల చరణాలు ఉటంకిస్తూ బిజెపిపై వ్యంగ్య బాణాలు వదిలారు. తాము తక్కువ తినలేదంటూ బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ ఆయనపై కవితలనే దూశారు.

తాము మాత్రం తక్కువ తినలేదంటూ బిజెపి నేతలు కూడా 'కవితలకు కవితలతోనే' సమాధానమిచ్చారు. 'మీ కవితకు కవితతో జవాబు చెప్పాల్సిందే. లేకపోతే బాకీ పడిపోతాం' అంటూ బిజెపి నేత సుష్మా స్వరాజ్ కూడా కవితాస్త్రాలు సంధించారు. మన్మోహన్, బిజెపి మధ్య సాగిన కవితా యుద్ధం ఆసక్తికరంగా సాగింది.

మన్మోహన్: హమ్‌కో హై ఉన్‌సే వఫా కీ ఉమ్మీద్, జో జాన్‌తే నహీ హై వఫా క్యా హై! (వారి నుంచి మేం విశ్వాసం ఆశిస్తున్నాం... కానీ, వారికి విశ్వాసమంటే ఏమిటో తెలియదు.)

సుష్మా: 'తుమ్‌హే వఫా యాద్ నహీ, హమే జఫా యాద్ నహీ. జిందగీ ఔర్ మౌత్ కే తో దో హీ తరానే హై! ఏక్ తుమ్హే యాద్ నహీ, ఏక్ హమే యాద్ నహీ' (మీకు మా విశ్వాసం గుర్తుండదు. మేం మీ విశ్వాసరాహిత్యాన్ని గుర్తుపెట్టుకోం! జీవితంలో రెండే పాటలుంటాయి.. ఒకటి మీకు గుర్తుండదు! మరొకటి మేం గుర్తుపెట్టుకోం!).

Sushma Swaraj

మన్మోహన్: ఈ అహంకారం కమలానికి కొత్తేమీ కాదు. ఇలాగే ఉంటే మళ్లీ ఓటమి తప్పదు.

సుష్మ: కుచ్‌తో మజ్‌బూరియా రహే హోంగీ, యోంహీ బేవఫా నహీ హోతా' (ఏదో తప్పనిసరి కారణం ఉండే ఉంటుంది... లేకుంటే ఇలా ఎవరూ విశ్వాసంలేని వారిగా మారరు).

మన్మోహన్: 'జో గరజ్‌తే హై.. వో బరస్‌తే నహీ!' (గర్జించే మేఘాలు వర్షించవు)

రాజ్‌నాథ్: ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.

ఇలా లోకసభ కవితాస్త్రాల యుద్దాన్ని చవి చూసింది. చాలా కాలంగా లేని వాతావరణం దీంతో లోకసభలో బుధవారం ఏర్పడింది.

English summary
It was an unusual duel in Parliament on Wednesday when an aggressive Prime Minister Manmohan Singh used an Urdu couplet to lambast the Bharatiya Janata Party (BJP) and Leader of Opposition in the Lok Sabha Sushma Swaraj responded in kind with two verses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X