వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు సత్యసాయిబాబా భక్తుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Maduro is Sai Baba devotee
వెనిజులా: వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు నికొలస్ మదురో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా భక్తుడు. ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నపుడు 2005లో పుట్టపర్తికి కుటుంబ సమేతంగా వచ్చారు. అప్పట్లో ఆశ్రమం వారు బహూకరించిన సాయిబాబా నిలువెత్తు చిత్ర పటం మదురో కార్యాలయంలో ఇప్పటికీ దర్శనమిస్తుంది. సత్యసాయి 2011 ఏప్రిల్ 24న శివైక్యం పొందిన అంశం మదురో చొరవతో వెనిజులా పార్లమెంటులోనూ ప్రస్తావకు కూడా వచ్చింది.

వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణించడంతో ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గురువారం వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు మదురో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.

నేడు చావెజ్ అంత్యక్రియలు

కాగా, రెండు రోజుల క్రితం కన్నుమూసిన వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి. అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టెలో భద్రపర్చినట్లు తాత్కాలిక అధ్యక్షుడు నికోలస్ మదురో చెప్పారు.

ప్రజలు ఆయనను ఎప్పటికీ చూసుకోవచ్చునని తెలిపారు. హ్యూగోను చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తున్నారు. పలువురు దేశాధినేతలు శ్రద్ధాంజలి ఘటించారు. నేడు జరిగే అంత్యక్రియల్లో సుమారు ఇరవై రెండు దేశాల ప్రతినిధులు పాల్గొనే అవకాశముంది. భారత్ నుంచి కేంద్రమంత్రి సచిన్ పైలట్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మరోవైపు చావెజ్ అంత్యక్రియల అనంతరం ఆయన పార్థివ మృతదేహాన్ని మిలటరీ మ్యూజియంలో గాజుపెట్టెలో శాశ్వత సందర్శనార్థం భద్రపర్చనున్నారు.

English summary
Vice President of Venezuela Nicolas Maduro is devotee of Bhagvan Sri Sathya Sai Baba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X