హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను అడగలేదు: నామినేషన్ వేసిన అప్పారావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Adireddy Apparao
హైదరాబాద్: తనకు పదవి కావాలని వైయస్ జగన్‌ను అడగలేదని, తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం ద్వారా బిసీలను ఆదుకుంటామనే నమ్మకాన్ని కల్పిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. శానససభ్యుల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన శనివారం నామినేషన్ వేశారు. వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు రాజీనామాలు చేసిన శానససభ్యులు కూడా ఆయన వెంట నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు.

తాను తెలుగుదేశం పార్టీలో 18 ఏళ్ల పాటు ఉన్నానని, రాజమండ్రి మేయర్‌గా తన భార్యను గెలిపించుకున్నానని, అంతకు మించి తనకు పదవులు దక్కలేదని, తగిన స్థానం దక్కలేదని తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చానని ఆయన అన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోనే బీసిలకు న్యాయం జరుగుతుందని నిరూపితమైందని ఆయన అన్నారు. కులవృత్తులు నశిస్తాయని అనుకుంటున్న తరుణంలో ఆ వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే జగన్ తనను ఎమ్మెల్సీ సీటుకు ఎంపిక చేశారని ఆయన అన్నారు.

తనకు ఎమ్మెల్సీ సీటుకు ఎంపిక చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని కొన్ని రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో ఏమీ చేయడం లేదని అన్నారు. జగన్ ఆచరణలో బీసీలకు ప్రాధాన్యం కల్పించారని ఆయన అన్నారు. కె. ఎర్రంనాయుడి వియ్యంకుడిని అయినంత మాత్రాన తాను వైయస్సార్ కాంగ్రెసులో ఉండకూడదని ఏమీ లేదని ఆయన అన్నారు.

బీసీలకు మేలు చేయాలన్నదే జగన్ ఆలోచనా విధామని, అందుకే ఒక్క ఎమ్మెల్సీ సీటును వెనకబడిన తరగతులకు చెందిన ఆదిరెడ్డి అప్పారావుకు కేటాయించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఉపనేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అప్పారావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల బీసీలకు న్యాయం చేసినట్లయిందని, ఇది చాలా సముచితమైన నిర్ణయమని ఆయన అన్నారు.

అప్పారావు ఒక్క బీసీల్లోనే కాదు, ఇతర వర్గాల ప్రజలతో కూడా కలిసి మెలిసి ఉంటారని ఆయన చెప్పారు. రెండో అభ్యర్థిని రంగంలోకి దించుతారా అని అడిగితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధర్మాన కృష్ణదాస్ పక్కనే ఉన్న గండికోట శ్రీకాంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఎదుటి పక్షం వ్యూహాలను బట్టి తమ వైఖరి ఉంటుందని దర్మాన చెప్పారు. మీ అభ్యర్థి విజయానికి కావాల్సినంత మంది ఎమ్యెల్యేలున్నారా అని అడిగితే పోలింగులో తెలుస్తుంది కదా తమ బలమని, తొందర ఎందుకుని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

English summary
YS Jagan's YSR Congress MLC candidate Adireddy Apparao has filed nomination. He said that Jagan has selected him for the MLC seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X