వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వాళ్లను చూడండి!: చిరంజీవి లాబీయింగ్, అలక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శాసన సభ్యుల కోటాలో జరుగనున్న శాసన మండలి అభ్యర్థుల లిస్టులో తమ వారి పేర్లు ఉండేందుకు లాబియింగ్ చేస్తున్నారట. ఇందుకోసం ఆయన పలువురు ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు చిరంజీవి ఫోన్ చేసి ప్రత్యేకంగా ఇద్దరి పేర్లు సూచించినట్లుగా తెలుస్తోంది.

కోటగిరి విద్యాధర రావు, గౌతమ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాల్సిందిగా చిరంజీవి బొత్సకు సూచించినట్లుగా సమాచారం. చిరంజీవి కోటగిరికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారట. ఒకవేళ సామాజిక సమీకరణాలు కుదరకపోతే గౌతమ్‌కు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారట. మరోవైపు కాంగ్రెసు ఎమ్మెల్సీల జాబితా ఇప్పటికే ఖరారైనట్లుగా చెబుతున్నారు. అందులో చిరంజీవి సూచించిన పేరు లేదు. ఐదుగురి పేర్లను మాత్రమే ఇప్పటి వరకు ఖరారు చేశారు. మరో అభ్యర్థిగా చిరంజీవి సూచించిన వారి పేరు లిస్టులో ఉంటుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది.

చిరంజీవి అలక

చిరంజీవి ఎంతగా ప్రయత్నాలు చేసినప్పటికీ తాను ప్రతిపాదించిన ఇద్దరిలో ఒక్కరికి అవకాశం రాకపోయేసరికి అలకబూనారట. కోటగిరి, గౌతమ్‌లకు సామాజిక సమీకరణాలు కుదరకపోవడం వల్లనే ఇవ్వలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో చిరంజీవి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట.

కాగా, ఇప్పటికే ఎమ్మెల్సీల అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారై పోయినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఖమ్మం నుండి పొంగులేటి సుధాకర్ రెడ్డి, కరీంనగర్ నుండి సంతోష్ కుమార్, తూర్పు గోదావరి జిల్లా నుండి లక్ష్మీ శివ కుమారి, విజయనగరం నుండి కోలగట్ల వీరభద్ర స్వామిలను ఎంపిక చేశారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఖరారైందనే వార్తలు వచ్చినప్పటికీ చిరంజీవి సహా పలువురు లాబీయింగ్ మాత్రం చేస్తూనే ఉన్నారట. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పలువురు వరుసగా భేటీ అవుతున్నారు. మంత్రి రామచంద్రయ్య, కంతేటి సత్యనారాయణష భారతి రాగ్యానాయక్, షబ్బీర్ అలీ, కోలగట్ల వీరభద్ర స్వామిలు బొత్సతో భేటీ అయ్యారు.

English summary
It is said that Central Minister Chiranjeevi is lobbying for MLC ticket for Kotagiri Vidyadhara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X