వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భర్త తప్ప ఏంలేవా? మాతో వస్తారా: బాబుకు షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
గుంటూరు: అవిశ్వాసంపై తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సొదరి షర్మిల శనివారం సవాల్ విసిరారు. తాము అవిశ్వాసం పెడతామని మద్దతిస్తారా అని ఆమె టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. మీరు అవిశ్వాసం పెట్టకుంటే మేం సిద్ధంగా ఉన్నామని, మీరు మద్దతిస్తారా అంటూ సవాల్ చేశారు. గుంటూరు జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది.

చంద్రబాబు అసెంబ్లీకి రారని, అవిశ్వాసం పెట్టరని ఆమె విమర్శించారు. అదేంటని అడిగితే ఆ పని తమ పార్టీనే చేయమంటున్నారని, కేసుల భయంతోనే బాబు కాంగ్రెసు ముందు మోకరిల్లారన్నారు. కాంగ్రెసు పాలన నాటి చంద్రబాబు పాలనను తలపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మాకొద్దని ప్రజలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం అవిశ్వాసం పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు.

అవిశ్వాసం పెడితే జగన్ అధికారంలోకి వస్తారనే భయం టిడిపిలో కనిపిస్తోందన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కయ్యాయని, కలిసిపోతాయని వ్యాఖ్యానించడం చంద్రబాబు రాజకీయ అనైతికకు నిదర్శనం అన్నారు. జగన్‌కు బలముందని, తమకు కలువాల్సిన అవసరం లేదన్నారు. జగన్ హవాలో వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసులు మట్టికొట్టుకు పోవడం ఖాయమన్నారు.

నా భర్తపై చర్చా?

రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు అసెంబ్లీలో తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ పైన నిలదీయాలని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైయస్ కుటుంబం పైన కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. సిబిఐకి చంద్రబాబు చేసిన అక్రమాలు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లాంటి నేతలు చేస్తున్న అవినీతి ఎందుకు కనిపించడం లేదన్నారు. దేవుడున్నాడని, జగన్ బయటకు వస్తాడని ఆమె అన్నారు.

English summary
Sharmila challenges Chandrababu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X