హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ ఇంటర్వ్యూపై లోకేష్ ట్వీట్: విహెచ్ నిప్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao-Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మరోసారి ట్విట్టర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన స్పందించారు. నాడు జగన్ సోదరి షర్మిల అవిశ్వాసం అని సవాల్ విసిరితే.. నేడు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ 2014లో పొత్తు అని చెబుతున్నారని, రేపు జగన్ వచ్చి విలీనం అని చెబుతారేమోనని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ పలు సందర్భాలలో ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే.

అనిల్‌కు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు

షర్మిలను పెళ్లి చేసుకున్నప్పుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే అనిల్ అడ్డగోలుగా సంపాదించారని విమర్శించారు.

జగన్‌పై మళ్లీ విహెచ్

జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించాడని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. జగన్ గ్రాఫ్ క్రమంగా పడిపోతుందని, అందుకే దానిని సవరించికునేందుకు విలీనం అంటూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. వైయస్ విజయమ్మకు తన తనయుడు చేస్తున్న తప్పులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లోను రాష్ట్రంలో కాంగ్రెసు గెలుస్తుందని, రాహుల్ గాంధీ బలం పైన తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. జగన్ తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడన్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉన్నప్పుడు జైలుకు వెళ్లారని, తప్పు చేశారు కాబట్టే కేసు నమోదయిందన్నారు. విలీనం అంటూ విజయమ్మ ఎవరు చెప్పారన్నారు. వారితో కలవాల్సిన అవసరం తమకు లేదన్నారు.

జగన్ ప్రభావం క్రమంగా తగ్గుతోందన్నారు. విజయమ్మను ఎవరూ పిలవలేదని, తమ పార్టీని తిట్టే వాళ్లను తీసుకుంటామని ఎలా చెబుతామని ప్రశ్నించారు. జగన్ నీతిపరుడు అయితే జైల్లో ఎందుకు ఊచలు లెక్కబెడుతున్నారో చెప్పాలన్నారు. తప్పు చేసిన ఎవరినీ కాంగ్రెసు పార్టీ వదలదన్నారు. ఇంకెంత మంది జైళ్లకు వెళ్తారో తెలియదన్నారు.

English summary
Nadu Sharmila said no confidence, Nedu Vijaya garu says alliance with Cong post 2014, & Repu will Jagan say merger?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X