హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వైయస్ విజయమ్మ ఇంటర్వ్యూతో నిజాలు బయటకు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఢిల్లీ పెద్దలతో చీకటి ఒప్పందాలు ఉన్నట్లుగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ జాతీయ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సోమవారం అన్నారు. కేవలం ఢిల్లీ పెద్దలు చదువుకోవడం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఇంగ్లీషు పత్రికలో నిజాలు చెప్పారన్నారు.

విజయమ్మ ఇంటర్వ్యూతో అసలు నిజాలు బయటపడ్డాయన్నారు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు ఆ పార్టీయే చేసుకుంటోందన్నారు. అందుకే ఇంగ్లీషు దిన పత్రికలకు మాత్రమే నిజాలు చెబుతూ... తెలుగు దిన పత్రికలను విస్మరిస్తున్నారని చెప్పారు. విజయమ్మ ద్వారా ఆ పార్టీ బండారం బయటపడిందన్నారు. కర్నాటక స్థానిక ఎన్నికల్లో శ్రీరాములు పార్టీ అడ్రస్ గల్లంతు లేకుండా పోయిందని విమర్శించారు. జగన్ పార్టీకి అదే పరిస్థితి వస్తుందన్నారు.

గతంలో ప్రజారాజ్యం పార్టీని ఉపయోగించుకొని టిడిపిని దెబ్బతీసే ప్రయత్నాలు చేసిన కాంగ్రెసు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అవినీతి పార్టీలకు కాలం చెల్లిందని కర్నాటక ఫలితాలు తేటతెల్లం చేశాయన్నారు.

ప్రజా సమస్యలపై ఐతే..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యల పైన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాసం పెడితే తాము మద్దతిస్తామని టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అంతకుముందు అన్నారు. జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట చేస్తున్న పాదయాత్రకు అజెండా లేదన్నారు. జగన్‌కు చంచల్‌గూడ పార్టీ కార్యాలయంగా మారిందని, అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోందని మండిపడ్డారు.

పార్టీ కోసం పని చేసే వారిని పట్టించుకోండి

పార్టీ కోసం పని చేస్తున్న వారిని పట్టించుకోవాలని టిడిపి నేత అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దేవేందర్ గౌడ్ పార్టీని విడిచి వెళ్లి తిరిగి పార్టీలోకి వస్తే రాజ్యసభకు పంపించారన్నారు. తాను ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నా న్యాయం జరగలేదని అన్నారు. కాగా మల్కాజిగిరి స్థానం కోసం దేవేందర్ గౌడ్, మైనంపల్లి హన్మంత రావు మధ్య విబేధాలు రాజుకున్నాయి.

English summary
Telugudesam Party senior leader Payyavula Keshav said that YSR Congress Party honorary president YS Vijayamma revealed facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X