వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటకలో కాంగ్ హవా: బిజెపి ఢీలా, గాలికి చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress-BJP
బెంగళూరు: కర్నాటక స్థానిక సంస్థల ఎన్నికలల్లో అధికార భారతీయ జనతా పార్టీకి చుక్కెదురయింది. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ హవా కొనసాగింది. పురపాలక ఎన్నికల్లో విపక్ష కాంగ్రెసు పార్టీ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మరో ప్రతిపక్ష పార్టీ జెడిఎస్ ఉంది. అధికార పార్టీ ముక్కలు కావడంతో ఆ ప్రభావం పడింది. దీంతో ఆ పార్టీ గానీ, ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిన వారు గాని అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంలో చతికిల పడ్డారు.

కర్నాటకలో 3500 స్థానాలు ఉండగా ఎక్కువ స్థానాలలో కాంగ్రెసు పార్టీయే విజయం సాధించింది. ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆ తర్వాత స్థానంలో జెడిఎస్ ఉంది. కర్నాటకలోని ఏడు కార్పోరేషన్‌లలో కాంగ్రెసు ఆరింట ఆధిక్యంలో ఉంది. బిజెపిని వీడి కొత్త పార్టీ పెట్టిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు ఎదురు దెబ్బ తగిలింది. బళ్లారి, కోలార్ జిల్లాల్లో శ్రీరాములు పార్టీకి ఎదురు గాలి వీచింది.

తమ కారణంగానే ఇక్కడ బిజెపి ఉందని చెప్పిన శ్రీరాములు, గాలికి అక్కడ ఊహించినంత గెలుపు దక్కలేదు. బళ్లారిలోని 34 వార్డుల్లో కాంగ్రెసు 25 చోట్ల గెలుపొందగా శ్రీరాములు పార్టీ కేవలం ఆరు చోట్ల మాత్రమే గెలిచింది. కర్నాటకలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ హవా వీయడంతో కాంగ్రెసు క్యాడర్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. గాలి అనుచరుడు శ్రీరాములు పెట్టిన బిఎస్సార్ పార్టీ తుడిచి పెట్టుకు పోవడం ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది.

అదే సమయంలో అధికారంలో ఉన్న బిజెపికి గట్టి షాక్ తగిలింది. బళ్లారిలో బిజెపి, జెడిఎస్ ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. యడ్యూరప్ప పార్టీ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదు. అధికార బిజెపి, ఆ పార్టీ వీడి బయటకు వచ్చిన శ్రీరాములు, యడ్డీ ప్రభావం ఏమాత్రం కనిపించక పోవడం, కాంగ్రెసు ఆ తర్వాత జెడి ప్రభావం చూపడం గమనార్హం.

English summary
The opposition Congress in Karnataka has forged ahead in the March seven elections to urban local bodies in the state, for which counting was taken up on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X