వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం కనిపించింది. విదేశాల్లోను శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ శైవ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, కోటప్పకొండ, శ్రీకాళహస్తి భక్తులతో కిటకిటలాడాయి. అన్ని గుళ్లలోను శివనామస్మరణ మారుమోగింది.

కృష్ణా తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంద్రకీలాద్రి వద్ద దుర్ఘాఘాట్‌తో పాటు సీతమ్మవారి పాదాల ఘాట్, భవాని ఘాట్, పున్నమి ఘాట్‌లలో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానమాచరించారు. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసాన్ని ఖర్జూర తదితర పదార్థాలతో విడిచి పెట్టారు.

రాత్రి జాగారం చేసిన పలువురు భక్తులు శివుడిని భజనలతో స్తుతించారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామి వారిని దర్సించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకు లింగోద్భవ అభిషేకాలు చేశారు. మంత్రి కాసు వెంకట కృష్ణా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

పలువురు నేతలు స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి దానం నాగేందర్ కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తిలో అమృతోత్పాదన సమయంలో.. ఆవిర్భవించిన కాలకూట విషాన్ని కంఠాన ధరించి సృష్టిలోని జీవకోటిని రక్షించిన సంర్వాంతర్యామి ఈశ్వరుడు ఇంద్ర వాహనంపై ఊరేగారు.

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

ఆలయంలో శివుడికి భక్తుల పూజలు.

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

ఒడిశాలో ఓ శివాలయంలో

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

హర హర మహాదేవ.. ఆలయంలో భక్తుల అభిషేకం

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

మహంకాలీ కొలువై ఉన్న ఉజ్జయిని నగరం

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

అలహాబాదులో శివభక్తుడు

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

శివుడికి భక్తుడి పూజలు

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

వారణాశిలో భక్తుల కోలాహలం

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

అలహాబాదులో పుణ్యస్నానం చేస్తున్న సాధువు

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

కాశీ విశ్వేశ్వర మందిరం కిటకిట

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

కూటి కోసం శివుడి రూపంలో...

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

పాటియాలోలో

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

హరిద్వారలో

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

పాటియాలాలో శివుడికి విదేశీ భక్తురాలు అభిషేకం

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

దక్షిణాఫ్రికాలోని బెనోనిలో శనివారం ప్రతిష్టించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అర్ధనారీశ్వర విగ్రహం. శివరాత్రి సందర్భంగా శివుడికి హెలికాప్టర్ ద్వారా పుష్పాభిషేకం చేశారు. 9 మంది కళాకారులు పది నెలలు శ్రమించి 90 టన్నుల ఉక్కుతో 20 మీటర్ల ఎత్తైన ఈ విగ్రహానికి ప్రాణం పోశారు.

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

అమృత్‌సర్‌లో భక్తుల కోసం భారీ కేక్

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

శివుడిని స్మరిస్తున్న భక్తురాలు

విదేశీ భక్తురాలి పూజ: ఎత్తైన అర్ధనారీశ్వరుడు(పిక్చర్స్)

విశాఖలో ఎంపి సుబ్బిరామిరెడ్డి పూజలు

మరోవైపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహాకుంభమేళాలో భక్తులు పోటెత్తారు. త్రివేణిసంగమంలో లక్షలాదిమంది పుణ్యస్నానాలాచరించారు. రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ కూడా ఆదివారం పుణ్యస్నానాలాచరించారు. గంగా నదీతీరంలోని దేవాలయాలన్నీ భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. శివలింగాలకు రుద్రాభిషేకాలు నిర్వహించారు.

శివనామ స్మరణతో ఆయా ప్రాంతాలు మారుమోగాయి. కాగా ప్రపంచంలోని అతిపెద్ద మత కార్యక్రమం కుంభమేళా ఆదివారంతో ముగిసింది. గత అరవైరోజులుగా కొనసాగిన ఈ మహోత్సవంలో సుమారు 12 కోట్లమంది భక్తులు పాల్గొని పుణ్యస్నానాలాచరించారని ఓ అంచనా. గత నెల 10వతేదీన మౌని అమావాశ్య సందర్భంగా ఆ ఒక్కరోజే మూడు కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు.

English summary
Lakhs of devotees today thronged the confluence of Ganga, Yamuna and mythical Saraswati here for a holy dip on the auspicious occasion of Maha Shivaratri, bringing the Maha Kumbh to a close.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X