కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్

అఘాయిత్యం అనంతరం బాధితురాలి(34)ని ప్రగతి మైదాన్ సమీపంలో రహదారిపై పడేసి పోయారు. కారులో మొత్తం ఆరుగురున్నారు. వారిలో ఇద్దరు మహిళలేనని తెలుస్తోంది. పైగా వారంతా తనకు తెలిసిన వారేనని బాధితురాలు తెలిపారు. పాండవనగర్ నుంచి అక్షరధామ్‌కు వెళ్తున్నపుడు అక్షరధామ్ స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆమె అపహరణ జరిగింది.
బాధితురాలి వద్దకు వేగంగా వచ్చిన కారులోని దుండగులు ఆమెను లోపలకు లాగేసి ఎక్కించుకున్నారు. అత్యాచారం చేసిన తరువాత ఆమెను రోడ్డుపై పడేసిన దుండగులు రెండు మొబైల్ ఫోన్లను, కొన్ని నగలను కూడా దోచుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమెను వైద్యపరీక్షలకు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినా, ఆదివారం రాత్రి పొద్దు పోయేటప్పటికి ఎవరినీ అరెస్టు చేయలేదు.
ఈ మహిళనే గత 12 ఏళ్ల కాలంలో మూడు వేర్వేరు ఫిర్యాదులు చేసింది. తాజా ఫిర్యాదులో కూడా 2012లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్న పేర్లను పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!