వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనిజులా అధ్యక్షుడు చావెజ్‌పై విష ప్రయోగం: మోర్సెల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Hugo Chavez may have been poisoned: Bolivian president
వెనిజులా: వారం రోజుల క్రితం మృతి చెందిన వెనిజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విష ప్రయోగం వల్లే చావెజ్ మరణించారని, దీనికి ద ఎంపైర్(సార్వభౌముడు) కారణమని బొలీవియా అధ్యక్షుడు ఇవో మోరెల్స్ ఆరోపించారు.

ఆయన చావెజ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి కారకాస్ వచ్చినపుడు ఈ విధంగా వ్యాఖ్యానించారు. చావెజ్ అంత్యక్రియల్లో సుమారు ముప్పై దేశాల అధినేతలు పాల్గొన్నారు. చావెజ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తనకు తెలుసునని మోరెల్స్ చెప్పారు. అయితే ఎంపైర్ అన్న పదానికి సరైన అర్థం ఆయన వివరించకపోవడం గమనార్హం.

కాగా, చావెజ్‌కు కేన్సర్ రావడానికి వెనిజువెలా దేశ శత్రువులే కారకులని ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నికోలాస్ మదురో కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఓ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

14 ఏళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవలే మరణించిన చావెజ్ వారసుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 14న ఈ మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా వ్య వహరిస్తున్న మదురో చావెజ్ వారసుడిగా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Bolivian President Evo Morales has said he is "almost certain" that "the empire" had poisoned the late Venezuelan leader Hugo Chavez. Chavez, who led Venezuela for 14 years, died at age 58 after a two-year-long fight against cancer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X