వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైయస్‌కు గాలి జనార్ధన్ రూ.500 కోట్లు బహుమతి'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy - YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి 2009 ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.500 కోట్లు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మంగళవారం అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా గాలి జనార్ధన్ రెడ్డి అంగీకరించారన్నారు. ప్రముఖ కన్నడ పత్రికలో ఈ వార్త వచ్చిందని ఆయన తెలిపారు.

తాను వైయస్‌కు రూ.500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి సిబిఐ విచారణలో అంగీకరించినట్లుగా ఆ పత్రికలో వచ్చిందన్నారు. గాలి ఇచ్చిన డబ్బును వైయస్ 2009లో ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల ఖర్చును కూడా 2009లో గాలియే భరించారని, దీనిని ఆయనే స్వయంగా అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయన్నారు.

ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాస్తానని చెప్పారు. సిబిఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టు ముందుకు వస్తుందన్నారు. వైయస్ తనకు చేసిన ఉపకారానికే గాలి అంత పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బు ఇచ్చారన్నారు.

కెసిఆర్, జగన్ ప్రమాణం చేయాలి

అవిశ్వాసం పెడతామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అవిశ్వాసంపై సవాల్ విసురుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు తమ పార్టీలను కాంగ్రెసులో కలపమని ప్రమాణం చేయాలని టిడిపి సీనియర్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భవిష్యత్తులో తెరాసను కాంగ్రెసులో కలపమని కెసిఆర్.. ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి పైన ప్రమాణం చేయాలని, జగన్, విజయమ్మ, షర్మిలలు వైయస్ సమాధి పైన ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.

English summary
Telugudesam Party senior leade Payyavula Keshav has alleged that Karnataka former minister Gali Janardhan Reddy gave Rs.500 crore to the late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X