మల్కాజ్‌గిరిపై 'లోకల్' చిచ్చు: మైనంపల్లి X దేవేందర్

Mynampally Hanumantha Rao - Devendar Goud
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల రగడ ప్రారంభమైంది. రాజధానిలోని మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ పైన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్, మరో సీనియర్ మైనంపల్లి హన్మంత రావు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి పోటీ చేయాలని మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షుడు మైనంపల్లి భావిస్తున్నారు.

దీనిని దేవేందర్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనంపల్లి సోమవారం దేవేందర్ గౌడ్ పైన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వబోమని రెండు రో జుల కిందట దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాట అనేందుకు ఆయన ఎవరని, ఈ మాటకు వస్తే తానే లోకల్ అని, ఆయనే నాన్ లోకల్ అన్నారు. దేవేందర్ గౌడ్‌కు రంగారెడ్డి జిల్లాతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

దేవేందర్ గౌడ్ నగరంలోని పాత బస్తీకి చెందిన వారని ఆయన రంగారెడ్డి జిల్లాలో ఎలా పెత్తనం చేస్తారన్నారు. ఏ అర్హత ఉందని ఆయన మేడ్చల్‌లో పోటీ చేశారని ప్రశ్నించారు. ఇపుడు ఏ అర్హత ఉందని తన కుమారుడిని ఉప్పల్ నుంచి పోటీకి నిలబెట్టాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. పదవులన్నీ ఆయనకు, ఆయన కుటుంబీకులకేనా అని ధ్వజమెత్తారు. తాను స్థానికుడ్ని కనుకే మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్నానని, పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్పారు.

నియోజకవర్గంలోని అల్వాల్ తాను పుట్టి పెరిగిన ప్రాంతమని, ప్రస్తుతం కూడా ఇక్కడే ఉంటున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చని, ఈ విషయం సీనియర్ నేత దేవేందర్ గౌడ్‌కు తెలియకపోవడం విచారకరమన్నారు. టిడిపి వల్ల రాజకీయంగా ఎదిగిన దేవేందర్ పార్టీకే వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్, చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు.

గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ఆయనే కారణమన్నారు. కొందరిని ఆయన అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బిసి కార్డుతో పార్టీలో ఎదిగిన దేవేందర్ బిసిలకు చేసిందేమీ లేదన్నారు. క్షమాభిక్ష పెడితే తిరిగి పార్టీలోకి వచ్చారని, ఆయన కొన్నాళ్లు పార్టీ కోసం శ్రమించి తన పనితనాన్ని రుజువు చేసుకోవాలన్నారు. అలా కాకుండా పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఆయన టిడిపిని వీడి కొత్త పార్టీ పెట్టినప్పుడు తన వెంట రానివారిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో నాయకులకు కొదవ లేదని వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ స్థానికులే పోటీ చేస్తారని బయట వారికి ఎలాంటి అవకాశం కల్పించబోమని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+