వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మన్ యువతిపై రేప్: దోషి బిట్టీకి పుట్టపర్తి లింక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bitti Mohanty
హైదరాబాద్: జర్మన్ యువతిపై అత్యాచారం కేసులో జైలు నుంచి పారిపోయిన బిట్టి మొహంతి ఆంధ్రప్ర్దదేశ్‌లోని పుట్టపర్తిలో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన బిట్టి మొహంతి రాఘవ్ రాజన్‌గా చెప్పుకుంటూ పుట్టపర్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. బిట్టితో పాటు అతని తండ్రి కూడా పుట్టపర్తిలో ఉన్నట్లు ఓ హెడ్ మాస్టర్ చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక రాసింది.

మూడేళ్ల పాటు అతను పుట్టపర్తిలో ఉన్నాడని, ఇక్కడి నుంచే కేరళలోని కన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రాంవకోర్‌లో రాఘవ్ రాజన్‌గా ఉద్యోగం సంపాదించాడని అంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ ఉద్యోగం ఇచ్చే సమయంలో వెరిఫికేషన్ కూడా చేయడం లేదని చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన మూడు నెలలోగా పత్రాలు రావాల్సి ఉండగా సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చాయి. అది కూడా మారు పేరుతో అతను ఉద్యోగం చేస్తున్నాడని బయటపడిన తర్వాత ఆ పత్రాలు వచ్చాయి.

రాఘవ్ రాజన్‌గా తన శాశ్వత చిరునామా అనంతపురం జిల్లాదే ఇచ్చాడు. సంఘటన జరిగిన తర్వాత ఏడాదికి పుట్టపర్తి చేరుకున్న బిట్టి మొహంతి రాఘవ్ రాజన్‌గా చెలామణి అవుతూ వచ్చాడని, తన తండ్రి పేరును రాజీవ్ రాజన్‌గా చెబుతూ వచ్చాడని అంటున్నారు.

పుట్టపర్తిలోని దీనజనోద్ధరణ పథకంలో భాగంగా అనాథ శరణాలయం నిర్వహిస్తున్నారు. దాని ప్రధానోపాధ్యాయుడిగా రామారావు అనే వ్యక్తి అప్పట్లో పనిచేస్తున్నాడు. సత్యసాయిబాబా భక్తునిగా పరిచయమైన ఓ పోలీసు అధికారి ద్వారా బిట్టి మొహంతి రామారావుకు పరిచయం అయ్యాడు. తనకు రాఘవ రాజన్‌గా అతన్ని పరిచయం చేసినట్లు రామారావు చెప్పినట్లు పత్రికలు రాశాయి.

రామారావుకు పరిచయమైన తర్వాత బిట్టి మొహంతి 2007లో అనాథాశ్రమం కంప్యూటర్ విభాగంలో చేరాడు. బ్యాంకు పరీక్షలు రాశానని చెప్పేవాడని రామారావు చెప్పారు. అయితే, రాఘవ రాజన్‌గా బిట్టి మొహంతి బ్యాంక్ ఉద్యోగం పొందడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఎలా సంపాదించాడనేది తేలాల్సి ఉంది. బ్యాంకు ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా బిట్టి మొహంతి పుట్టపర్తికి వచ్చి పోతుండేవాడని అంటున్నారు.

English summary
Bitti Mohanty, who posed as Raghav Rajan, had concealed his identity and stayed in Puttaparthi in Anantapur district, a year after his rape of the German woman, a retired headmaster here has confirmed, adding Bitti’s father also stayed with him here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X