వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మన్ యువతిపై రేప్: ప్రేయసి లేఖతో దొరికిన బిట్టీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bitti Mohanty
తిరువనంతపురం: ప్రేయసి లేఖతోనే బిట్టి మొహంతి విషయం బట్టబయలు అయినట్లు తెలుస్తోంది. జర్మన్ యాత్రికురాలి అత్యాచారం కేసులో దోషిగా తేలి ఆరేళ్ల పాటు పరారీలో ఉన్న బిట్టి మొహంతి కథ ఆ లేఖతోనే వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంపర్సనేషన్, ఫోర్జరీ ఆరోపణలపై రాఘవ్ రాజన్ అనే వ్యక్తిని కేరళ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

రాఘవ్ రాజన్ బిట్టి మొహంతియేనని తేలింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బిట్టీ మొహంతి రాఘవ్ రాజన్ గుర్తింపుతో వ్యవహరిస్తున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్‌లో రాఘవ్ రాజన్ పేరుతో పనిచేస్తున్న బిట్టి మొహంతిని పోలీసులు అరెస్టు చేశారు.

బిట్టి మొహంతి ఎవరనే విషయం తెలియజేస్తూ చేతిరాతతో ఉన్న ఆకాశరామన్న ఉత్తరం అతను పనిచేస్తున్న బ్యాంకుకు వచ్చింది. ఆ లేఖను అతని మహిళా సహోద్యోగి రాసినట్లు సమాచారం. ఆమె బిట్టి ప్రేయసి అని కూడా చెబుతున్నారు.

బ్యాంక్ ఫిర్యాదుతో బిట్టి మొహంతిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వ్యక్తిగత వివరాలు, అతను చెబుతున్న విషయాలకు మధ్య పొంతన లేదని బ్యాంకు ఉన్నతాధికారులు చెప్పారు. బిట్టి బ్యాంకులో ఏడు నెలలుగా పనిచేస్తున్నాడని, కన్నూరు విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చేసినట్లు చెబుకున్నాడని పోలీసులు అంటున్నారు. కేరళలోని కన్నూరులోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

26 ఏళ్ల జర్మన్ యాత్రికురాలిపై అత్యాచారం చేసిన కేసులో బిట్టి మొహంతికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత పెరోల్‌పై విడుదలై పరారయ్యాడు. తన హోదాను వాడి బిట్టీ తండ్రి అతని పరారీకి సహాయపడ్డాడు.

English summary
Bitti Mohanty arrest happened after the bank where he was working received an anonymous letter (handwritten) detailing who Raghav Rajan actually is. The letter was written by a woman colleague of Bitti, who was also his lover.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X