హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు టార్గెట్: విడిగా జగన్ పార్టీ అవిశ్వాసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Mysoora Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విడిగా రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి రేపు గురువారం వైయస్సార్ కాంగ్రెసు నోటీసు ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రతిపాదించడానికి సిద్ధపడిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది.

తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే తమ వాదనకు మరింత బలం చేకూరుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడుతున్నారని తాము మరింత బలంగా చెప్పడానికి అవకాశం లభిస్తుందని అనుకుంటోంది. కాంగ్రెసు ప్రభుత్వానికి పాలించే సత్తా లేదని, అందువల్ల తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కలిసి రావాలని మైసురా రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

కాంగ్రెసును రక్షించడానికే చంద్రబాబు కుంటి సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసుపై ప్రజలకు నమ్మకం లేదని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ముందుకు వస్తే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని, వెనక్కి తీసుకోవాలని ఇతర పార్టీలను కూడా అడుగుదామని, తామంతా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తామని ఆయన అన్నారు. అన్ని పక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలబెడుదామని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తోకపార్టీలుగా చంద్రబాబు అభివర్ణించడంపై ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిపడ్డారు. ఉప ఎన్నికల్లోనే తోక పార్టీ ఎవరిదో తేలియిందని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. భవిష్యత్తులో తోక పార్టీ ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అవిశ్వాసంపై వెనక్కు తగ్గడం ద్వారా కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెలుస్తోందని ఆయన అన్నారు.

English summary
YS Jagan's YSR Congress party has decided to propose no confidence motion on CM Kiran kumar Reddy's government. YSRCP leader MV Mysura Reddy appealed to Telugudesam party president N Chandrababu Naidu to support No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X