హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాలు వదిలేస్తా: బాబుకు బాలినేని హామీ, సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balineni Srinivas Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్‌కు ఇచ్చిన అనంతరం బాలినేని మాట్లాడారు. టిడిపి మద్దతిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టే బాధ్యత మాదే అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టని పక్షంలో తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

బాబు మద్దతివ్వాలి

తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి టిడిపి మద్దతివ్వాలని తెరాసఎల్పీ నేత ఈటెల రాజేందర్ సూచించారు. లేదంటే కాంగ్రెసు పార్టీతో టిడిపి కుమ్మయిన విషయం నిజమే అవుతుందన్నారు. అవిశ్వాస నోటీసును ఆలస్యంగా ఇచ్చిన అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. తామందరం కలిసి వెళ్లి అవిశ్వాస నోటీసు ఇవ్వాలనుకున్నామని అందుకే గంట ఆలస్యమయిందని చెప్పారు.

రాజకీయమే

తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ తమ రాజకీయ అజెండా కోసమే అవిశ్వాసం పెడుతున్నాయని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తెరాస, ముందస్తు ఎన్నికల కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాసం పెడుతున్నాయన్నారు. కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా ఎప్పుడు అవిశ్వాసం పెట్టలేదని ధర్మాన అన్నారు. ప్రతిపక్షాల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.

ప్రభుత్వం సేఫ్

కాంగ్రెసు పార్టీకి అవిశ్వాస తీర్మానంతో ఎలాంటి ముప్పు లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అవిశ్వాస తీర్మానానికి టిడిపి దూరంగా ఉంటుందని తమకు సమాచారం ఉందన్నారు. కాంగ్రెసు ఎమ్మెల్యేలు కొందరు ధిక్కరించినా వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు.

తెరాస, జగన్ పార్టీ కుమ్మక్కు

తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించాలని తాము సభాపతిని కోరనున్నట్లు చెప్పారు.

English summary
YSR Congress party MLA Balineni Srinivas Reddy has challenged Telugudesam Party chief Nara Chandrababu Naidu on No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X