వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్‌పై జగన్ వ్యూహం: ఎమ్మెల్యేలు రాజీనామా వెనక్కి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Alla Nani - Maddala Rajesh
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌లు తమ రాజీనామాలు వెనక్కి తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహంలో భాగంగానే వారు తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌లు ఇటీవల కాంగ్రెసు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలు స్పీకర్ వద్దే ఉంటే వాటిని ఆయన ఆమోదించే అవకాశముంది.

అవిశ్వాసం ఎదుర్కొనేందుకు వాటిని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇది కాంగ్రెసు పార్టీకి లాభిస్తుంది. అధికార పార్టీకి లాభించకుండా ఉండేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహంలో భాగంగా వారిద్దరు రాజీనామాలను వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామాలు చేసిన వారు.. తమ రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు.

ఈ సమావేశాల్లో అధికార పార్టీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనే పరిస్థితి వస్తే వీరిద్దరు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మరో రెండు ఓట్లు అవిశ్వాసానికి అనుకూలంగా, కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా జగన్ పార్టీ వ్యవహరించి వారిద్దరి రాజీనామాలు వెనక్కి తీసుకునేలా చేసిందంటున్నారు.

రాజీనామాలు వెనక్కి తీసుకోలేదు

తాము రాజీనామాలు వెనక్కి తీసుకున్నారన్న ప్రచారంపై ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌లు స్పందించారు. తాము స్పీకర్‌ను కలువలేదని, రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, ఇదంతా తమపై చేస్తున్న దుష్ప్రచారం అని వారు అన్నారు.

English summary
It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Congress MLA Alla Nani and Maddala Rajesh were withdrew their resignation on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X