వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలులో మరో ఆత్మహత్య: ఈసారి మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Thiar Jail
న్యూఢిల్లీ: తీహార్ జైలులో మరో ఆత్మహత్య చోటు చేసుకుంది. వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్య చేసుకుని నాలుగు రోజులు కూడా గడవకముందే మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది.

అహరణ కేసులో నిందితురాలైన 30 ఏళ్ల మహిళ గురువారం ఆత్మహత్య చేసుకుంది. దీంతో జైలు అధికారుల్లో ఆందోళన చోటు చేసుకుంది. సెల్‌లో ఉరేసుకుని మహిళా ఖైదీ కనిపించింది. వెంటనే ఆమెను జైలు సిబ్బంది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు తెలుస్తోంది.

ఆమె ఉంటున్న సెల్‌లో మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉన్నారు. అయితే, సంఘటన జరిగిన సమయంలో వారిద్దరు పని మీద బయట ఉన్నట్లు తెలుస్తోంది. విచారణ ఖైదీ రేష్మా గురువారం సాయంత్రం జైలు నెంబర్ 6లో ఉరేసుకుంది. సహచర ఖైదీలు ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్లు జైలు అధికారులు చెప్పారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు.

వైద్య విద్యార్థిని సామూహిక అత్యాచారం కేసులో రాంసింగ్ సోమవారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, అతన్ని చంపారని రాంసింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాంసింగ్ మరణం జైలులో భద్రతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది.

English summary
Four days after the shocking news of Ram Singh's alleged suicide inside Tihar jail, the prison authorities faced another heat on their faces. A 30-year-old woman, an accused of a kidnapping case, killed self on Thursday, March 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X