వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు రాష్ట్రాలు బోల్తా: బిట్టీకి సాయపడిందెవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bitti Mohanty
హైదరాబాద్: రాఘవ రాజన్ పేరుతో చెలామణి కావడానికి బిట్టీ మొహంతికి సాయపడిందెవరనేది ఇప్పుడు కీలకంగా మారింది. రాఘవరాజన్ పేరుతో బిట్టీ మొహంతిని పుట్టపర్తిలో పరిచయం చేసిన వ్యక్తులెవరనే విషయంపైనే కాకుండా ఏ ఉద్దేశంతో అతడిని అక్క డ ఉండేలా చేశారు వంటి కోణాల్లో కేరళ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. రామారావు అనే రిటైర్డ్ టీచర్ సత్యసాయి భక్తుడిగా పుట్టపర్తిలో ఉంటున్నారు. ఆయన వద్ద రాఘవరాజన్ ఉంటున్నట్లు స్పష్టమైంది. అయితే ఆయనకు బిట్టీ మొహంతిని పరిచయం చేసిన వ్యక్తులెవరనే విషయంపై కూడా కేరళ పోలీసులు ఆరా తీస్తున్నా రు.

మొహంతీ అజ్ఞాత వాసంలో గడిపిన కాలంలో అత్యధికంగా పుట్టపర్తిలోనే మకాం వేశాడని, ఇక్కడి నుంచే రాఘవ రాజన్‌గా అతను కొత్త అవతారం ఎత్తాడని కేరళ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కేరళలోని బ్యాంకులో ఉద్యోగం సంపాదించడానికి కూడా పుట్టపర్తినుంచి పలు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఓటరు గుర్తింపు కార్డుతో సహా నివాస ధృవీకరణ పత్రం, ఇతర బ్యాంకు ఉద్యో గానికి అవసరమయ్యే ధృవీకరణ పత్రాలన్నీ కూడా పుట్టపర్తి కేంద్రంగానే బిట్టీ మొహంతి సమర్పించినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే కేరళలోని బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడని, చివరకు అసలు రూపం బయటపడగానే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారని తెలు స్తోంది.

బిట్టీ మొహంతి అలియాస్ రాఘవరాజన్ మూడు రాష్ట్రాల పోలీసులను బోల్తా కొట్టించాడు. పుట్టపర్తిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారిపై, విదేశీయులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. అయితే ఒక అపరిచిత వ్యక్తి రాఘవరాజన్ పేరుతో పుట్టపర్తిలో ఏళ్ల తరబడి ఉన్నా కనీసం అతని కదలికలను పోలీసులు గుర్తించలేకపోయారా అనేది ప్రశ్నగానే ఉంది.

యేటా ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తుల వివరాలను నిఘా వర్గాలు సేకరిస్తుంటాయి. బిట్టీ మొహంతి నిఘా వర్గాల కళ్లను కూడా కప్పగలిగాడా అనేది మరో ప్రశ్న. ప్రస్తుతం కేరళ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఎవరెవరు అతడితో కలిసి ఉండేవారు? ఎవరి సహకారంతో పుట్టపర్తిలో మకాం వేశాడు? వివిధ సర్టిఫికెట్లు ఎలా సంపాదించాడు? బ్యాంకు ఖాతాలు ఎప్పుడు తెరిచాడు? అతడి కోసం ఎవరెవరు వచ్చేవారు? ఏయే నెలల్లో అతడిని సంప్రదించారు? వారు బంధువులా? తల్లిదండ్రులా? తదితర పూర్తి వివరాలను కేరళ పోలీసులు ఆరా తీస్తున్నారు. తన తల్లిదండ్రులను బిట్టీ మొహంతి చిన్నమ్మ, చిన్నాన్నలుగా పరిచయం చేశాడని అంటున్నారు.

English summary
Bitti Mohanty alias Rafgav Rajan has succeeded in ditcheing the police of three states and he has managed to stay in Puttaparthi with out trouble.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X