హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిట్టియా, రాఘవా?: ఫింగర్ ప్రింట్స్‌తో వీడనున్న మిస్టరీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళలో మారు పేరుతో ఉద్యోగం చేస్తున్నాడనే ఆరోపణపై కేరళలోని కన్నూరులో అరెస్టయిన రాఘవ్ రాజన్ జర్మన్ యువతిపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన బిట్టి మొహంతి అని చెప్పడానికి చాలా ఆధారాలే ఉన్నాయని అంటున్నారు. అయితే, చివరగా ఫింగర్ ప్రింట్స్ మిస్టరీని పూర్తిగా ఛేదించే అవకాశాలున్నాయి.

ఫింగర్ ప్రింట్స్ గుర్తింపు పరీక్షలు చేసి దర్యాప్తు అధికారులు రాఘవ రాజన్ పేరుతో చెలామణి అవుతున్న యువకుడు బిట్టీయా, కాదా అనే విషయం పూర్తిగా నిర్ధారించనున్నారు. ఆరేళ్లుగా పరారీలో ఉన్న బిట్టిని కేరళ పోలీసులు ఈ నెల 8వ తేదీన అరెస్టు చేశారు. పెరోల్‌పై తండ్రి ఒడిషా మాజీ డిజిపి బిబి మొహంతి సహకారంతో జైలు నుంచి బయటకు వచ్చిన బిట్టీ మొహంతి మారు పేరుతో కేరళలోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నట్లు బయటపడింది.

పుట్టపర్తిలో కేరళ పోలీసుల దర్యాప్తు

ఇదిలా వుంటే, జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై విడుదలై వచ్చి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తలదాచుకుని సుమారు ఐదు సంవత్సరాల పాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన బిట్టీ మొహంతి వ్యవహారం సంచలనం రేపుతోంది. బిట్టీ మొహంతి వ్యవహారంపై కేరళ పోలీసులు పుట్టపర్తిలో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే కేరళకు చెందిన స్పెషల్ బ్రాంచ్ సీఐ అబ్దుల్‌ఖాదర్‌తోపాటు మరో నలు గురు పోలీసులు మంగళవారం పుట్టపర్తికి విచ్చేశారు.

Bitti Mohanty

అంతకుముందు జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీంను కలిసిన కేరళ పోలీసులు బిట్టీ కేసులో సహకరించాలని కోరినట్లు సమాచారం. పుట్టపర్తిలో తమకు బస ఏర్పాట్లు చేయ డంతో పాటు బిట్టీ వ్యవహారం తేలేవరకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరినట్లు తెలిసింది. తరువాత పుట్టపర్తికి విచ్చేసిన కేరళ పోలీసులు అక్కడ బిట్టీ నివాసమున్న ప్రాంతాల్లోను, ఆయా ప్రాంత వాసులతోను మాట్లాడారు. 2007లో బిట్టీ పుట్టపర్తికి విచ్చేసి సాయి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో ఉండేవాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఏమాత్రం ముఖపరిచయం లేని వ్యక్తికి ఎలా ఆశ్రయమిచ్చారనే కోణంలో కేరళ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నట్లు సమాచారం. బిట్టీ మొహంతి రాఘవరాజన్ పేరుతో కేరళ లోని ఓ బ్యాంకులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో పొం దుపరిచిన పలు ధృవీకరణ పత్రాలను తీసుకుని కేరళ పోలీసులు పుట్టపర్తిలోకి ప్రవేశించారు.

తాను పుట్టపర్తి వాసిగా పేర్కొంటూ రాఘవరాజన్ పేరుతో బ్యాంకులో ఉద్యోగం సంపాదించిన బిట్టీ మొహంతి ఆయా ధృవీకరణ పత్రాలను ఎక్కడ తీసుకున్నారనే విషయమై కేరళ పోలీసులు తహసీల్దార్ కార్యాలయంలో కూడా విచారించారు. గెజిటెడ్ హోదాలో ఉన్న ఉద్యోగి అటెస్ట్ చేసిన ధృవీకరణ పత్రాలను కూడా వారు తమవద్ద పెట్టుకుని వాటిని కూడా పరిశీలించారు.

రాఘ వరాజన్ పేరుతో బిట్టీ మొహంతికి హో మియోపతి డాక్టర్ కిష్టయ్య ధృవీకరణ పత్రాలపై అటెస్ట్ చేసినట్లు ఉండడంతో కేరళ పోలీసులు ఆయనను కూడా విచారించారు. అయితే ఎంతోమంది రోగులు తన వద్దకు వస్తుంటారని, అందులో భాగంగానే పచ్చకామెర్ల వ్యాధితో రాఘవరాజన్ తన వద్దకు వచ్చాడని, ఆ దృష్టితోనే తాను అతడి ధృవీకరణ పత్రా లపై అటెస్ట్ చేశానని ఆయన కేరళ పోలీ సుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం.

బ్యాంకు ఖాతాల కోసం పరిశీలన

రాఘవరాజన్ పేరుతో బిట్టీ మొహంతి ఓ బ్యాంకులో ఖాతా కూడా తెరిచినట్లు కేరళ పోలీసులు పసిగట్టారు. ఆ ఖా తాలోకి ఎక్కడెక్కడినుంచి డబ్బులు వ చ్చాయి? ఎప్పుడెప్పుడు లావాదేవీలు నడిపాడు? తదితర విషయాలపై కూడా కేరళ పోలీసులు దర్యాప్తు సాగించారు. కొద్దిరోజుల పాటు తాము పుట్టపర్తిలో మకాం వేయడానికి అన్ని రకాల సహా యసహకారాలు కావాలని జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీంను కేరళ పోలీసులు కోరినట్లు సమాచారం. పుట్టపర్తిలోని కెనరాబ్యాంకుకు కూడా కేరళ పోలీసులు వెళ్లి విచారించినట్లు సమా చారం.

English summary
The investigation teams probing the Bitti Mohanty alias Raghav Rajan case have enough documentary evidences to prove that the man whom they have arrested last week from Kerala is indeed the rape convict Bitti Mohanty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X