హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల కేసు నిందితుడు తెలిశాడు: డిజిపి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dinesh Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు ఎవరనేది తెలిసిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి చెప్పారు. సిసిటివీ ఫుటేజ్ ద్వారా నిందితుడు ఎవరనేది తెలిసిందని, అతను ఎక్కడున్నాడో కనిపెట్టాల్సి ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఒక వర్గం వారినే తాము అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు.

పేలుళ్లకు కారణం ముస్లిం జిహాదీ గ్రూపులా, హిందూ అతివాద సంస్థలా అనేది ఇంకా గుర్తించలేదని ఆయన చెప్పారు. అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో ఒక వర్గంవారినే లక్ష్యం చేసుకున్నామనే వాదన సరి కాదని ఆయన అన్నారు.

అన్ని కోణాల నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని అన్నారు. నిందితుడిని పోలీసులు గాలిస్తున్నారని ఆయన చెప్పారు. పేలుళ్ల కేసులో ముస్లిం అమాయక యువకులను వేధిస్తున్నారని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే.

మళ్లీ వారిద్దరి విచారణ

హైదరాబాదు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల నిందితులకు ఢిల్లీ హైకోర్టు నాలుగు రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులను కస్టడీకి అప్పగించాలన్న ఎన్ఐఏ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ హైకోర్టు ఇద్దరు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల కస్టడీకి అనుమతినిచ్చింది. త్వరలో ఉగ్రవాదులను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.

English summary
DGP Dinesh Reddy disclosed that the suspect in Dilsukhnagar bomb blasts case and police are trying to nab him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X