వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వర్గంపై వేటేసినా...: జెసితో విబేధించిన గాదె!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gade venkat Reddy - JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేల పైన ఇప్పట్లో వేటు పడినా ఉప ఎన్నికలు రాకపోవచ్చునని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకట రెడ్డి శనివారం అన్నారు. 2009 మే 21న అసెంబ్లీ ప్రారంభమైందని, వేటు దశలు అయిపోయేసరికి సంవత్సరమే ఉండదని ఆయన అన్నారు.

ఉప ఎన్నికలు త్వరగా రావాలి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు ఎమ్మెల్యేలపై తొందరగా వేటు వేస్తేనే మేలని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు వచ్చినా ఫరవాలేదన్నారు. ఇప్పడికే జగన్ గ్రాఫ్ తగ్గిపెయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

జైలు పార్టీతో కలవలేకే...

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఆయుధంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగిస్తారని, రాజకీయ ప్రయోజనాల కోసం బేరసారాలకు ఉపయోగపడే సాధనంగా మాత్రం కాదని, కొనుగోళ్ళు, ఫిరాయింపులతో ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడం, అవినీతి సొమ్మును విరజిమ్మి రాష్ట్రాన్ని కలుషితం చేయడమే చంచల్‌గూడ జైలు పార్టీ లక్ష్యమని, దానితో కలవలేకే తటస్థంగా ఉన్నామని టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి కుంభకోణాలపై 2004 నుంచి టిడిపి రాజీలేని పోరాటం చేస్తోందని ఒకవైపు వాళ్ళతో పోరాటం చేస్తూ మరోవైపు వాళ్ళ అవిశ్వాసాన్ని బలపర్చలేమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని పార్టీలన్నింటిని ఏకం చేసి కాంగ్రెస్‌ను కేంద్రంలో గద్దె దించిన ఘనత కూడా తమ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి అవిశ్వాసాన్ని వినియోగించుకోవాలని రాజ్యాంగ రచయితలు ఆదేశించారని, తాము దానికి కట్టుబడి ఉన్నామన్నారు.

English summary
Congress party senior MLA Gade venkat Reddy hoped that by polls may not come after taking action against YSR Congress Party chief YS Jaganmohan Reddy camp Congress MLAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X