ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షిండేకు ఆ అర్హత: కావూరి, జారిపోతారని..: కనుమూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
ఏలూరు: భారత దేశానికి ప్రధానమంత్రి కాగల అర్హత కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఉందని ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు ఆదివారం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడి పంచాయతీ శివారు మోడి గ్రామంలో మొగదిండి కాలువపై నిర్మించనున్న వంతెనకు సుశీల్ కుమార్ షిండే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కావూరి మాట్లాడారు.

షిండేకు ప్రధాని కాగల అర్హత ఉందన్నారు. మన రాష్ట్రం అంటే షిండేకు ప్రత్యేక అభిమానం అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన మన రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎనలేని అభిమానం అన్నారు. ఈ ఒక్క కార్యక్రమం కోసం ఆయన రావడంతోనే ఆయనకు ఎపి పట్ల ఉన్న అభిమానం తెలుస్తోందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన షిండే కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు.

కావూరి జారిపోతారనుకున్నారు....

ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు జారిపోతారని గతంలో ప్రచారం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు అన్నారు.

హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన అనంతరం షిండే మాట్లాడారు. జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. మొదటి దశలో రూ.15వందల కోట్లతో ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో దశలోని ఎపికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

English summary
Eluru MP Kavuri Sambasiva Rao has praised Central Minister Sushil Kumar Shinde on Sunday. Kavuri said that Shinde have PM qualities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X